సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలు అయ్యాయంటే రెండు సమస్యలు వస్తాయి. ఒకటి కాదనలేవు. రెండు నిరూపించలేవు.
పెదరాసి పెద్దమ్మ ఒంగోని తుడుస్తూ ఉంటే వీపుకి ఆకాశం తగిలేది అంట. చీపురు, చాట ఎత్తి కొడితే ఆకాశం అంత ఎత్తుకుపోయిందంట. ఆ పెద్దమ్మ కథల
కాణాచి.
ఆ పెద్దమ్మ లాంటి ఓ అమ్మ నది ఒడ్డునున్న ఆ గుడిసె ముందు తన బిడ్డలకి ఓ కథ చెప్తుంది.
వజ్రవైడూర్యాలకి సమతూకం కలిగిన కథ.
ఎనకటికాలాన నర్సాపురం ఊర్లో సూరాడ బండియ్య, అతని తొమ్ముడు కాశియ... అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. ఒకనాటి కాలాన రెయ్యిలు బాగా పడతనాయని రాత్రి గెంగలోకి ఏటకెళ్లారంట. నడిరాత్రి తెప్పలో నించొని వలకి తగిలిన రెయ్యినల్లా బుంగలో ఆడెత్తన్నారంట. అలా అవగా అవగా కాసేపుటికి బుంగ నిండిపోయిందేమో అని చూస్తే బుంగలో రెయ్యిలే లేవంట. అమ్మ దీనెమ్మ.. ఏమైపోయిందిరా రెయ్యల్లానా? అని అన్నదమ్ములిద్దరూ మొకమొకాలు చూసుకున్నారంట. అప్పుడు తొమ్ముడు కాశియ్య దూరంగా చూపిత్తా "ఓరన్నా అదిగోరా గ్యాపాట. మనం కానుకోనప్పుడు అక్కడినించి చెయ్యిచాపి బుంగలో రెయ్యిలన్నీ తినేస్తందిరా" అన్నాడంట. బండియ్య అటేపు చూసాడంట. కొండమీద....................