మబ్ధూం మొహియుద్దీన్ జీవితం
మఖ్తూం మొహియుద్దీన్ పూర్వీకుడైన అబూ సయీద్ ఖాద్రీ మహమ్మద్ ప్రవక్త స్నేహితుడన్న విశ్వాసం ఒకటుంది. అబూ సయీద్ ఖాద్రీ వారసులు ఎప్పుడు భారతదేశానికి వచ్చారో మఖ్తూంకు కూడా తెలియదు. మొత్తం మీద అబూ సయీద్ వారసులు ఉత్తర భారతదేశంలోనూ, మఖ్తూం తల్లి తరపు వంశంవారు షాజహానాపూర్లోనూ స్థిరపడ్డారు. మూం తల్లి తరఫు ముత్తాత సయ్యద్ జాఫర్ అలీ ఉత్తరప్రదేశ్ నుంచి ఒకప్పటి హైదరాబాదు రాష్ట్రానికి చెందిన మెదక్ జిల్లాకు వలస వచ్చాడు. ఇది 1857 నాటి సిపాయిల తిరుగుబాటు కాలంలో జరిగింది. సయ్యద్ జాఫర్ సయ్యద్ వంశానికి చెందినవాడు కాగా, అతని భార్య పఠాన్ల కుటుంబానికి చెందిన మహిళ. మఖూం తండ్రి తరపు పూర్వీకులలో ఒకడైన రషీదుద్దీన్ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రపు ఆజంగఢ్ నుండి హైదరాబాదుకు వచ్చాడు. వృత్తిరీత్యా సైనికుడైన రషీదుద్దీన్ ఔరంగాజేబు సైన్యంలో పనిచేస్తూ, ఆ దండయాత్రల్లో పాల్గొంటూ దక్షిణానికి వచ్చాడు. కాని తిరిగి ఉత్తరాదికి తరలిపోకుండా హైదరాబాదు రాష్ట్రంలోనే స్థిరపడ్డాడు. మఖూం వంశీకులు తరతరాలుగా దక్కన్లోనే స్థిరనివాసం ఏర్పరచుకొని వున్నారని చెప్పటానికి ఇదొక సాక్ష్యం. మబ్ధూం మతవిశ్వాసాలున్న కుటుంబానికి చెందినవాడు. మఖూం ముత్తాత మఖూముద్దీన్ మతవిశ్వాసాలు, దైవభీతి ఉన్నవాడు. ఆయన మన్మోల్ గ్రామంలో స్థిరపడ్డాడు. వ్యవసాయమే ఆయన జీవనాధారం. కాని మఖ్తూముద్దీన్ కొడుకు మాత్రం వ్యవసాయాన్ని కాదని ప్రభుత్వ ఉద్యోగానికి ప్రాముఖ్యమిచ్చాడు. మఖ్తూం తాత హసనుద్దీన్ సరిష్ఠా ముఖ్యలేఖకుడుగా మెదక్ జిల్లాలో నియమితుడయ్యాడు. కొంతకాలం తర్వాత ఆయన తన కుమారుడు, మఖ్తూం తండ్రి అయిన మహమ్మద్ గౌసుద్దీన్ను తన స్థానంలో నియమింపజేశాడు. మెదక్ జిల్లాలోని అందోల్లో మహమ్మద్ గౌసుద్దీన్ అహ్లెకార్గా పనిచేశాడు. మఖ్తూం పూర్వీకులు ప్రధానంగా ఉపాధ్యాయులు, లేఖకులు. మతపరమైన విధులు కూడా నిర్వహించారు.....................