సంపాదకీయం
సాహిత్యము యొక్క అసలు ప్రయోజనం
రచయిత యొక్క సామాజిక స్పృహమీద
ఆధారపడి ఉండడాన్ని అక్షరాలా
ఆచరణలో చూపించిన వీరేశలింగం పంతులూ,
గురజాడ అప్పారావుల తర్వాత
ఆదృక్పథంతో గట్టి ప్రయత్నం చేసిన
తెలుగు రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణగారు”
'కేతవరపు రామకోటిశాస్త్రి: ఈ గ్రంథంలో)
'మాలపల్లి' నవల వచ్చి నూరేళ్లయిన సందర్భాన్ని అర్థవంతంగా జరుపుకోవాలని ప్రజాశక్తి బుక్ హౌస్ సంకల్పించింది. ఈ క్రమంలో 'మాలపల్లి' నవల మీద ఇప్పటికే ప్రచురితమైన వ్యాసాలను సేకరించే పని మొదలుబెట్టాను. ఈ పనిని ప్రజాశక్తి బుక్ హౌస్ సంపాదకవర్గం నా కప్పగించింది. వ్యాస సేకరణ చేస్తున్న క్రమంలో వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో పనిచేసిన ఇద్దరు అచార్యులు కేతవరపు రామకోటిశాస్త్రిగారు, కె. కాత్యాయనీ విద్మహేగారు రచించిన ఐదు వ్యాసాలు (2+3) లభించాయి. ఆ ఐదింటినే ఒక సంపుటంగా వేస్తే బాగుంటుందన్న నా ప్రతిపాదనను సంపాదక వర్గం ఆమోదించింది. ఈ ఇద్దరు ఆచార్యులు తండ్రీ కుమార్తెలన్న విషయం అందరికీ తెలుసు. కాత్యాయనీగారు నా ప్రతిపాదనను ఆమోదించారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ అధ్యాపకులు, అందరి భావజాలం ఒకటి కాకపోయినా, గట్టి సిద్ధాంత బలం ఉన్నవారు. స్థూలంగా చెప్పాలంటే మార్కిస్టులు, అంబేద్కరీయులు, సంప్రదాయ వాదులు అని వింగడించవచ్చు. అయితే............