ప్రియమైన నాని,
ఈ విశాలమైన ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు. మనిషి జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి తగిన ప్రయత్నాలు మనమే చేసుకోవాలి.
విపరీతమైన మనస్తత్వాలతో ఉండే మనుష్యుల మధ్య మనం తిరుగుతున్నాం. వాళ్లందరినీ సంతృప్తిపరుచుకుంటూ జీవితాన్ని నెట్టుకు రావడం ఒకింత కష్టమే కానీ, ప్రయత్నం చేసుకోవాలి.
అసూయ, ద్వేషం, పగ మొదలయిన వాటితో కొంత మంది బాధపడుతుంటారు. వాళ్ళకి ప్రేమ అంటే తెలియదు. తన వాళ్లనే ప్రేమించే తత్వంతో కొందరుంటారు. మిగతా ప్రపంచం వాళ్లకి అవసరం లేదు. అవసరం కొద్దీ ప్రేమించే వాళ్ళు కొంత మంది ఉంటారు. ఇలా భిన్నమైన ఈ మనుష్యుల సంగతిని మనం తెలుసుకుంటూ, మసలు కోవడం చాలా అవసరం.
మన చుట్టూరా సహజవనరులు, సంపద ఉన్నాయి. వాటిని గుర్తించి, మన పరం చేసుకోవడం కోసం తగిన శ్రమ పడాలి. ఈ చిన్న జీవితాన్ని అనందమయం చేసుకోవడంలో మన చుట్టూ వుండే సమాజాన్ని, మిత్రులను, సహచరులను కలుపుకుంటూ పోవాలి. జగమంతా ప్రేమమయం చేయడంలో మన పాత్రను మనం పోషించాలి......................