• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mana Ghantasala

Mana Ghantasala By Dr P S Gopala Krishna

₹ 500

మన ఘంటసాల

ఘంటసాల. మన ఘంటసాల.

ఇంటి పేరుతోనే ప్రసిద్ధులయిన తెలుగు సంగీత ప్రక్రియ వెంకటేశ్వరరావు పూర్వీకులు ఘంటసాలలో ఎప్పుడున్నారో తెలియదు కానీ ఘంటసాల కుటుంబంవారు కృష్ణాజిల్లా టేకుపల్లిలో స్థిరపడ్డారు. ఘంటసాల వెంకటేశ్వరరావు (వేంకటేశ్వరరావు) తండ్రి సూర్యనారాయణరావుగారు. తల్లి రత్తమ్మగారు. సూర్యనారాయణరావుగారు 'ఘంటసాల సూరయ్య'గా ప్రసిద్ధులు.

ఘంటసాలవారిది తెలుగు బ్రాహ్మణులలో వెలనాటి వైదిక అర్చకశాఖ. గౌతమసగోత్రం. అనూచానంగా ఆలయాలలో అర్చకులుగా వ్యవహరిస్తూ, ఆయుర్వేదాన్ని అభ్యసించి ఆపదవేళల వైద్యులుగా ఆదుకుంటూ వచ్చిన తమ పూర్వీకులలాగా సూరయ్యగారు కూడా కృష్ణాజిల్లా చౌటపల్లిలోని ఆంజనేయ స్వామి కోవెలలో అర్చకులుగా ఉండేవారు. ఇప్పటికీ ఆ కోవెలలో అర్చకులు మంటసాల వెంకటేశ్వరరావుగారి అన్నగారైన ఆదినారాయణ శాస్త్రిగారి కుటుంబానికి చెందినవారే.

ఘంటసాల సూరయ్యగారి జీవితం అర్చకత్వానికి పరిమితం కాలేదు. “మా తండ్రిగారు ఘంటసాల సూరయ్యగారు సంగీతజ్ఞులు. మృదంగం కూడా వాయించేవారు. ప్రధానంగా వారు తరంగగానంలో ప్రత్యేక కృషి చేసినవారు. నేడు తరంగగానంలో సుప్రసిద్ధులైనవారు చాలామంది వారి నుండి శిక్షణ పొందినవారే" అని ఘంటసాల తమ చలనచిత్ర రజతోత్సవ ప్రత్యేక సంచికలో వెలువడిన 'మీ ఘంటసాల కథ'లో చెప్పారు. అందులోనే ఇంకా "మా తండ్రిగారు సంసారజీవితంలో అతి నిర్లిప్తంగా ఉండేవారు. ఇంట్లో ఉంటే జపం చేసుకుంటూ ఉండడం, బయటకు పోతే ఏ ఏకాహాలలోనో, సప్తాహాలలోనో భజన కాలక్షేపాలలోనో తన్మయులై గానం చేస్తూ ఉండడం - ఇంతే వారి జీవితవిధానం. సంసారబాధ్యతలను విస్మరిస్తున్నారని బంధువులంతా విమర్శించేవారు ఆయన్ని" అనీ అన్నారు.

సూరయ్యగారి నిర్లిప్తతకు కారణాలు లేకపోలేదు. మూడుసార్లు దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకు పోతే, రెండుసార్లు ఇల్లు కాలి తమదంటూ ఏదీ మిగలకపోతే నిర్లిప్తత కాక మరేం మిగులుతుంది? టేకుపల్లి నుంచి బతుకు తెరువుకోసం గొరిగెపూడికి వచ్చిన సూరయ్యగారు కుటుంబంతో ఒక పూరింట్లో కాపురం పెట్టారు. ఆ ఇల్లు కాస్తా కాలిపోవడంతో తిరిగి టేకుపల్లికి కాపురం తరలించారు. పూరిల్లయితే కాలిపోతుందని పెంకుటింట్లో మకాం పెడితే ఈసారి దొంగలు పడి అంతా ఎత్తుకుపోయారు. చివరకు సూరయ్యగారి భార్య రత్తమ్మగారు కప్పుకున్న శాలువా కూడా ఎత్తుకుపోయారు ఆ దొంగలు.

సూరయ్యగారు భార్యను తీసుకుని గుడివాడ దగ్గరున్న చౌటపల్లికి వచ్చారు. చౌటపల్లి రత్తమ్మగారి పుట్టింటివారి ఊరు. ఆమె తండ్రి ర్యాలి వెంకట్రామయ్యగారు...................

  • Title :Mana Ghantasala
  • Author :Dr P S Gopala Krishna
  • Publisher :Vanguri Foundation of America
  • ISBN :MANIMN5218
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :230
  • Language :Telugu
  • Availability :instock