మన చుట్టూ హీరోలున్నారు
హీరో అనగానే సినిమాల్లో ఉండే కథా నాయకుడు గానే తప్పా ఇంకోలా గుర్తించలేనంతగా మన అభిప్రాయలు స్థిరపడిపోయాయి. చివరికి 'మా నాన్నే నా హీరో' అనీ సినిమాలు చెబితేనే నాన్ననూ హీరోగా గుర్తించలేనంతగా అందులో పడిపోయాం. సుబ్బూ రాసిన ఈ 'మన హీరోలు' సినిమా హీరోల గురించి కాదు. వారి విచిత్ర విన్యాసాల గురించీ కాదు. మన చుట్టు రోజూ తిరగాడే మనుషుల గురించి. వారు చేసిన పనుల గురించి.
హీరో అనే పదానికి 'అత్యున్నత విలువలకు, గొప్ప విజయాలకు, ధైర్యానికి ప్రతీకగా ఉన్న వ్యక్తి' అనే నైఘంటికార్థం ఉన్నది. హీరో అనేది జెండర్ బయాస్డ్ అనే వాదన ఉన్నది కనుక షీరో అనే పదం మహిళలను ఉద్దేశించి వాడుతున్నారు ఫెమినిస్ట్ మిత్రులు. అయితే, సుబ్బు హీరో అనే పదాన్ని రెండు జెండర్లను ఉద్దేశించిన న్యూట్రల్ అర్థంలోనే వాడాడు.
ఇది మన చుట్టూ హీరోల పరిచయం. ఇందులో ఉన్న వాళ్ళే హీరోలా? అంటే... వీళ్ళే కాదు. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఉంటారు. లెక్కకు మించిన హీరోల్లో యాభై మందినే ఎన్నుకోవడంలో ప్రత్యేకత ఏముంది? అది వారి పరిచయాల్లో సుబ్బు చెబుతాడు మీకు. ఈ హీరోల్లో రచయితలున్నారు. చిత్రకారులున్నారు. ఎన్జీవో కార్యకర్తలున్నారు. టీచర్లున్నారు. వీళ్ళంతా మానవత్వం పరిమళించే మనుషులు. ఆ ప్రత్యేకతే సుబ్బుతో వాళ్ళ గురించి రాసేలా చేసింది. సుబ్బు ఈ పుస్తకానికి పెట్టిన ఉప శీర్షిక untold stories. ఆ శీర్షికకు తగినట్లే ఇందులో నలుగురైదుగురు తప్పా మిగతా వాళ్ళంతా unsung heros.
మన పక్కనే ఉండే మనుషుల్నే పట్టించుకోని కాలాన, హీరోలు మనుషులు వేరువేరు అని నమ్ముతున్న చోట మనుషుల్లో హీరోలను చిత్రిక పట్టిన పుస్తకమిది............