₹ 300
శ్రీ రావులపాటి సీతారాంరావు గారు జగమెరిగిన సాహితీవేత్త . తెలుగు పాఠకలోకానికి కథాకులుగా, నవలాకారునిగా , విమర్శకునిగా , వృత్తి పరంగా వ్యక్తిత్వ వికాస ప్రోత్సాహకునిగా సుపరిచితులు. వారి కథలు, హృదయవేదం, బ్రతుకుబొంగరం వంటి నవలలు సాహితీపరుల ప్రశంసల్ని పొందాయి. పోలీసుశాఖలో ఎంతో ఉన్నత పదవిని నిర్వహించిన సీతారాంరావుగారు "ఉద్యోగ విజయాలు" , " అన్ని చెప్పేస్తున్నా" లాంటి రచనలు చేసి కార్య నిర్వహణ శైలిని - యదార్థవాదిగా పాఠకలోకానికి అందించారు. సీతారాంరావుగారు చింతనాపరులు, సామజిక బాధ్యత నెరిగిన సాహితీకారులు కావటం వలన వారి మననాధార ఇంకా ప్రయోజనాత్మక జాతి సంపదైన మన ఇతిహాసాలవైపు మరలింది. అందుకే ఇప్పుడు "సీతారామాయణం ", "మహాభారతం", "శ్రీ కృష్ణావతారం ", "గీతానుబంధం" తోపాటు అనుబంధంగా "చాణక్యుడు - రాజనీతి" ని ఎమెస్కో ద్వారా పాఠకులకు అందిస్తున్నారు.
- Title :Mana Ithihasalu
- Author :Ravulapati Sitharamrao
- ISBN :MANIMN1850
- Binding :Paperback
- Published Date :Emesco Publications
- Number Of Pages :560
- Language :Telugu
- Availability :instock