రాయలసీమ గ్రామీణ చిత్రాలు
సన్నపురెడ్డి కథలు
సీమనిర్దిష్టతకు కథనాలు
గ్రామీణ జీవితం మీద కథలు రాసే రచయితల్ని రెండు రకాలుగా విభజించవచ్చు. గ్రామాలలో పుట్టి, చదువుకొని పట్టణాలలోనో, నగరాలలోనో ఉద్యోగాలు చేసుకుంటూ చుట్టపుచూపుగా ఎప్పుడో గ్రామాలకు వెళ్ళినప్పుడో, మాధ్యమాల ద్వారానో గ్రామాలలో వస్తున్న మార్పుల్ని గుర్తించి రాసేవాళ్ళు ఒక రకం. వీళ్ళు ఎక్కువమంది ఉంటారు. గ్రామాలలో పుట్టి గ్రామాలలో వ్యవసాయమో, ఉద్యోగమో, రెండూనో చేసుకుంటూ, అక్కడి జీవితాన్ని అనుభవించి రాసే వాళ్ళు రెండో రకం. ఈ రచయితల కథలలో జీవితం మరింత వాస్తవికంగా విశ్వసనీయంగా ప్రతిబింబిస్తుంది. వాళ్ళ వస్తువులలో వాళ్ళు ఉండటమే ఇందుకు కారణం. దీనినే నిబిడత అన్నారు కొలకలూరి ఇనాక్ గారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఈ రెండో రకం రచయిత. ఈయన రాయలసీమలోని వైయస్సార్ జిల్లాలో పోరుమామిళ్ళ ప్రాంతంలోని బాలరాజుపల్లెలో పుట్టారు. అక్కడే వ్యవసాయం చేసుకుంటూ, చుట్టుపక్కల పల్లెల్లో అధ్యాపకుడుగా పనిచేసుకుంటూ అక్కడి జీవితాన్ని అక్కడి ప్రజల భాషల్లో కథలుగా............