• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mana Pandugalu

Mana Pandugalu By Dr I L N Chandra Shekar Rao

₹ 200

పండుగలు

పండుగ లేదా పర్వదినం అంటే శుభవేళ, శుభాలను ప్రసాదించే రోజు అని అర్ధం. పండుగలు భారతీయ సంస్కృతిలో భాగమై విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. ఇంకోరకంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతికి దర్పణం. భారతీయ జీవన విధానంలో భాగమై... జీవన విధానానికి మార్గనిర్దేశం చేస్తూ విరాజిల్లుతున్న అనాదికాలం నుంచి జరుపుకోవడం ఆచారం.

లోకక్షేమాన్ని... మానవులతో పాటు ఇతర జీవరాశుల సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రకృతి ధర్మాలను దృష్టిలో ఉంచుకొని మన ఋషులు పండుగలను ఏర్పరిచారు. కాస్త లోతుగా పరిశీలిస్తే నక్షత్ర గమనాన్ని ఋతు మార్పిడి వల్ల ప్రకృతిలో కలిగే మార్పులను అనుసరించే పండుగలను ఏర్పరచినట్లు చెప్పవచ్చు. మారుతున్న ఋతువుల వల్ల ప్రకృతిలో... వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆరోగ్యంగా జీవించేందుకు ఏ విధులను అనుసరించాలి, ఎటువంటి ఆహారాన్ని | స్వీకరించాలి అనే విషయాలను పండుగల ఆచారాల్లో ఏర్పాటు చేసి ఋషులు ఈ ప్రపంచానికి అందించారు. పండుగల్లో కొన్ని ఋతు మార్పిడి... శీతోష్ణ స్థితులను బట్టి ఏర్పడితే, మరికొన్ని ఆయా ప్రాంతాలలోని సామాజిక జీవన విధానం, ఆచారాల నుంచి ఏర్పడ్డాయని చెప్పవచ్చు.

ఆరోగ్యవంతమైన ఆచారాలతో ఆధ్యాత్మిక సందేశాలతో ఉన్నతమైన జీవన | శైలిని ప్రసాదించే పండుగలు యాంత్రిక జీవనం నుండి సేదతీర్చి, శారీరక మానసిక ఆరోగ్యాలను కలిగించడంలో ప్రధానపాత్ర పోషిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా పండుగలు జీవిత సత్యాలు బోధిస్తూ... ఆధ్యాత్మిక తత్వాన్ని వివరిస్తూ... మనస్సును భగవత్ చింతన వైపు మళ్లిస్తూ ఉండడంతోపాటు మానవ జీవిత అంతిమ లక్ష్యమైన మోక్షసాధనకు మార్గాన్ని కలిగిస్తూ ఉన్నాయి..................

  • Title :Mana Pandugalu
  • Author :Dr I L N Chandra Shekar Rao
  • Publisher :Emesco Publications
  • ISBN :MANIMN5852
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :283
  • Language :Telugu
  • Availability :instock