పేరులేని చెట్టు
అడవికుటీరం వదిలిపెట్టేశాకా పేరు తెలియని చెట్టుకిందికి చేరుకున్నాం. దాని చుట్టుపక్కల వంద అడవిచెట్లు ఒకటైతే అది ఒకటి. అంత పెద్దది. అంత విస్తారమైనది. అంత దృఢమైనది. అంత ఎత్తైనదనను. వయసులో అంత పెద్దదనవచ్చు.
ఒక్కో ఆకు తొడిమ నుంచి కొనదాకా నా చేతి పొడవున్నాయి. ఆకులు బాగా ముదిరి కొమ్మల్నుంచి విడిపోయినప్పుడు నేను తలెత్తిచూసేలా చేస్తూ 'ఫుట్ ' అన్న శబ్దం చేస్తాయి. గిరగిరా తిరుగుతూ వచ్చి నేలని తాకుతాయి. చెట్టుకింద ఆకులు పోగులుపడి ఉన్నాయి. జనవరి నెల. చలి బాగా ముదిరిపోయింది............
మనం కలుసుకున్న సమయాలు 11.