ఆప్తవాక్యం
జాస్తి చలమేశ్వర్
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
మోటుపల్లి గురించి ఒక ప్రత్యేక సంచిక వెలువరిస్తున్నామని, అందుకు నాకు తోచిన నాలుగు ముక్కలు ముందుమాటగా వ్రాయమని మిత్రులు దశరథ, రామచంద్రారెడ్డి అడిగారు. సంచిక చిత్తుప్రతి కూడా నాకు ఇచ్చారు. అందులో చాలా భాగం ఇప్పటివరకు ప్రచురింపబడిన వివిధ వ్యాసాలు, ఇతర సమాచారం. ఆ వ్యాసాలను రాసినవారందరూ లబ్ధప్రతిష్టులు. అన్ని వ్యాసాల సారాంశం ఒక్కటే. సమాచారం మాత్రం పరిమితం. చరిత్రను సమగ్రంగా పదిల పరిచే అలవాటు భారతీయులకు తక్కువ కావడం వలన కలిగిన పర్యవసానం ఏమిటంటే లభించవలసిన సమాచారం లభించకపోవడం.
ప్రాచీన భారతీయ రచనావ్యాసంగం ఉత్ప్రేక్షలకు, అతిశయోక్తులకు ఇచ్చిన ప్రాముఖ్యత తారీఖులు, దస్తావేజులకు ఇవ్వలేదు. కారణాలు అనేకం, వివరాలు ఈ సందర్భంలో అనవసరం. తత్కారణాన భారతజాతి సాంఘిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ చాలా తక్కువగా జరిగిందని నా అభిప్రాయం.
దాదాపు 2000 సంవత్సరాల నాడే తమిళులు సముద్రయానం చేసి భారతేతర భూభాగాల మీద పెత్తనం, వ్యాపారాలు చేసినట్లు కొన్ని ఆధారాలు..............