• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Manasa Veena

Manasa Veena By Multiple Authors

₹ 200

మానస వీణ

భావరాజు పద్మినీ ప్రియదర్శిని

వాళ్లకు తెలిసినవి రెండే కులాలు... డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళు. వాళ్లకు ఎప్పుడూ తోడుండే నేస్తాలు రెండే .... ఆకలి, పేదరికం.

వాళ్ళ మనసుల్లో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు... “డబ్బు మా వద్ద ఎందుకు లేదు, మేము అందరిలా మంచి బట్టలు ఎందుకు వేసుకోలేము? నచ్చినవి ఎందుకు కొనలేము, తినలేము? ఆకలి ఆగనప్పుడు, చెత్తబుట్ట దగ్గర ఎంగిలాకులు ఏరుకు తినే కుక్క బ్రతుకులకి, మా బ్రతుక్కి తేడా ఎందుకు లేదు?" అవసరాలు ఎప్పటికప్పుడు ఆ ప్రశ్నల నోళ్ళు నొక్కేస్తూ ఉంటాయి. ఈ రోజు గడిచిందిగా, సరిపెట్టుకోమంటాయి.

వాళ్ళ కళ్ళల్లో ఆశల దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి. ఇలలోనో, కలలోనో ఎవరో ఒకరు దైవంలా వస్తారని, ఎండిన తమ బ్రతుకుల్లోకి వసంతం తెస్తారని... ఎడతెగని ఎదురుచూపులు. అమావాస్య చీకట్లు కమ్ముకుని, ఆకలికి, దాహానికి, దేహాన్ని కప్పుకోడానికి కూడా చాలీచాలని తమ బడుగు బ్రతుకుల్లోకి ఎవరో నిండు పున్నమిలా వస్తారని... వెన్నెల చలువలు తెస్తారని... నిరీక్షిస్తూ ఉంటారు. నిద్రలో కూడా ఉలికులికి పడుతుంటారు. ఎండకి, వానకి ఎండే వారి జీవితాల్లోకి హరివిల్లులా వెళ్తుంది 'మానస. అలాగని మానస కోటీశ్వరురాలు కాదు. మనలాంటి మామూలు మనిషే! 'మనసుంటే మార్గం ఉంటుంది...', అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సాధారణ వనిత ఆమె. యుక్తి, నమ్మిన పని పట్ల అనురక్తి, పట్టు సడలని సంకల్ప శక్తి... ఈ మూడూ కలిస్తే ఆ వ్యక్తి ఒక శక్తి అవుతాడు. అందుకే మానస తానే ఒక సైన్యంగా, తనలోని విశ్వప్రేమనే వాహినిగా, తన గమనాన్ని నిర్దేశించుకుని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.

లోకంలో రెండు రకాల వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. ఒకరు మార్గం కోసం నిరీక్షిస్తూ కాలం గడుపుతుంటారు. మరొకరు తమ మార్గం తామే.................

  • Title :Manasa Veena
  • Author :Multiple Authors
  • Publisher :Acchamga Telugu Prachuranalu
  • ISBN :MANIMN4823
  • Binding :Papar back
  • Published Date :Oct, 2021
  • Number Of Pages :240
  • Language :Telugu
  • Availability :instock