• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Manasu Gurramu Rori Manishee

Manasu Gurramu Rori Manishee By Nayuni Krishnamurty

₹ 50

మనసు గుర్రమురోరి మనిషీ!

కథ: ఇదివరకే జరిగిపోయింది.

కథానాయకుడు : సత్యమూర్తి. ప్రస్తుతం జాడ తెలియదు.

కథానాయిక : సత్యప్రభ. ఈమె ఇంతవరకూ జరగకథలో కథానాయిక.

స్థలం : పాడుపడిన దేవాలయానికి పునర్నిర్మాణం జరుగుతున్నచోటు- కోనేటిగట్టు - కోనేటిలో నిశ్చలంగా నీళ్ళు- సత్యప్రభ చేతిలో కొన్నిరాళ్ళు.

సమయం : మసక చీకటిగా ఉంది. ఆవరిస్తున్నది ఉపస్సంధ్యో, సాయంసంధ్య అంతుపట్టడంలేదు. తూర్పుకొండల నడుమ ఉదయించబోయేది చీకటిరాజు చంద్రుడో, వెలుగుల రేడు సూర్యుడో ప్రకటించబడలేదు. ముసురుకొంటుందో, తొలగిపోతుందో తెలీని చీకటిని చూస్తూ కూర్చున్న సత్యప్రభ గుండెల్లోని నమ్మకం మాత్రం అది ఉషస్సంధ్యేనని గోల పెడుతోంది.

కథనం : కథానాయిక తన చేతిలోని రాళ్ళవంక ఓ మారు చూసి . - చిన్నగా, వక్రంగా ఉన్న ఒక రాతిని ఏరి కోనేటి నీటిలోకి విసరివేసింది.

రాయి నీళ్ళను కలచింది.

నీళ్ళు స్రుళ్ళు తిరిగాయి.

సత్యప్రభ జ్ఞాపకాల గుర్రంపైకెక్కి వేలకొద్దీ దినాలు వెనక్కు దౌడు తీసింది....................

  • Title :Manasu Gurramu Rori Manishee
  • Author :Nayuni Krishnamurty
  • Publisher :V N R Book World
  • ISBN :MANIMN6089
  • Binding :Papar Back
  • Published Date :August, 2011
  • Number Of Pages :140
  • Language :Telugu
  • Availability :instock