• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Manavaliki Mahodayam

Manavaliki Mahodayam By D Paparao

₹ 400

భవిష్యత్తే సోషలిజం

ఫ్రెంచి విప్లవపు నినాదాలైన “స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం" చాలామందికి తెలిసినవే. ఈ నినాదాల ప్రాతిపదికనే పెట్టుబడిదారీ వర్గం ప్రజలను ఆకట్టుకోగలిగింది. అధికారాన్ని కైవసం చేసుకోగలిగింది. ప్రపంచంలోని ప్రతిమూలా పెట్టుబడిదారీ విప్లవాలకు ఈ నినాదం ఆలంబనగా వుంటూ వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు ముందు వున్న ప్యూడల్ సమాజంలోని పెత్తందారీతనాన్నీ, ఆధిపత్యాన్ని ఈ నినాదం సవాలు చేసింది. ప్రజలందరూ సమానమేనని, వారందరికీ స్వేచ్ఛా, సోదరభావాలను ప్రసాదిస్తానని పెట్టుబడిదారీ వ్యవస్థ వాగ్దానం చేసింది. ఈ క్రమంలో భాగమే పెట్టుబడిదారీ వ్యవస్థ క్రింద; వర్గాలతో సంబంధం లేకుండా ప్రతివ్యక్తికీ ఒకే ఓటు, తమ పాలకులను ఎన్నుకునే హక్కు వంటివి వచ్చాయి. అంటే యావన్మంది ప్రజలు "ప్రజాస్వామ్యం"లో భాగస్వాములేనని పెట్టుబడిదారీ వ్యవస్థ హామీని ఇచ్చింది. ఈ మేరకు చట్టాల రూపేణా కూడా ఒక వ్యవస్థను నెలకొల్పుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నూతన వ్యవస్థ పాత ఫ్యూడల్ వ్యవస్థ రాజ్యాంగ యంత్రాన్ని బద్దలు చేసి ఒక నూతన రాజ్యాంగ వ్యవస్థను (బ్యూరాక్రసీ లేదా అధికార గణం) ఏర్పరుచుకుంది.

చరిత్ర క్రమంలో దోపిడీ వ్యవస్థలు ఆరంభమైన తరువాత మారిన ఈ దోపిడీ రూపాలకు అనుగుణంగా రాజ్య వ్యవస్థలూ మారుతూ వచ్చాయి. దీనికి తార్కాణాలే చరిత్రలో మొట్టమొదటి దోపిడీ వ్యవస్థ అయిన బానిస వ్యవస్థ నుంచి దాని తరువాత కాలపు ప్యూడల్ వ్యవస్థలోకి మార్పు అనంతరం రూపురేఖలు.............................

  • Title :Manavaliki Mahodayam
  • Author :D Paparao
  • Publisher :Sahiti Mitrulu, Vijayawada
  • ISBN :MANIMN5606
  • Binding :Papar back
  • Published Date :Aug, 2024
  • Number Of Pages :399
  • Language :Telugu
  • Availability :instock