₹ 150
చిన్నప్పటినుంచి నేను ప్రకృతిని చూసి ఎంతో ఆనందపడేదాన్ని. పూలమొక్కలు, రకరకాల పళ్ళు, కాయలు చెట్లు చూసి ఏదో నాకు తెలియని ఆనందం కలిగేది. గాలి వీచినా అందులో ఏదో సంగీతం వినిపించేది. ఇలా సంగీతము, సాహిత్యమూ అలవాడడానికి కారణం మా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానంలో వారి వాతావరణంలో నాకు కలగడానికి కారకులు. ఎప్పుడూ భారత రామాయణాల గురించో, సంగీత సాహిత్యాల గురించో, దేశకాల పరిస్థితుల గురించో వారు మాట్లాడుకుంటుంటే ఆసక్తిగా వినేదాన్ని. మా ఇంటికి వచ్చే బంధువులు సాహిత్య సంగీతాలను అనుసరించేవారు. నేదునూరి కృష్ణమూర్తిగారు సంగీత విద్వాంసుడు, మా అమ్మగారికి మేనమామ కొడుకు. మా అమ్మగారు నేదునూరి కృష్ణమూర్తి గారితో సమానంగా పాడేవారు.
- పోలాప్రగడ రాజ్యలక్ష్మి
- Title :Manchi Manasulu
- Author :Pola Pragada Rajyalakshmi
- Publisher :J V Publications
- ISBN :MANIMN0648
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :155
- Language :Telugu
- Availability :instock