• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Manchu Poovu

Manchu Poovu By Kasibatla Venugopal

₹ 200

పగటి కాంతులు శిధిలమౌతూ ఆ శిధిలాల్లోంచీ చీకటి నిర్మితమౌతోంది... పడమటి ఆకాశానికింకా ఆరని సంధ్య మరకలున్నై హేమంతపు తెమ్మెర... శరీరపు పైపొరను తొలుచుకుని ఎముకల్ని తాకే ప్రయత్నం చేస్తోంది...

దూరంగా సిటీ సిలవెట్ చిత్రంలో ఫ్యాక్టరీ చిమ్నీ పొగ ఘనీభవించి... సంధ్య మరకల్లో యింకో మరకైంది...

చారలాగా ...

ప్రవహిస్తున్న ఏరు, ప్రవహిస్తూ... ప్రవహిస్తూ... ఘనీభవించినట్టు... కొన్ని చిల్లర కాంతుల్నీ... గడ్డిపోచల పొడవు చీకటి నీడల్నీ వంకర టింకరగా ప్రతిబింబిస్తో... ప్రవహిస్తున్న నన్ను కూడా ఘనీభవించిన మాయాభావనలోకెళ్ళమని నన్ను ప్రేరేపిస్తూన్నట్టు.

మడిచి పెట్టేసిన ఈ దినం పొట్లం రేపు రేకు విడిచి తూర్పున తెరుచుకుంటుంది నాలు...

మరి మడతలు మడతలుగా అలలు అలలుగా... ప్రవహిస్తూనే ముడుచుకు పోయిన్నన్ను... నన్ను... యెట్లా రేకు... రేకుగా... తరంగ... తరంగాలుగా... యెట్లా విడదీసుకునేది?

నా ఆలోచనా తరంగదైర్ఘ్యమనబడే ఫ్రీక్వెన్సీ... యెక్కడ యెవరాలోచనలో

యెప్పుడూ కాదు... నాకు తెలుసు నేనొంటర్ని...

నా ఆలోచనొంటర్ది...

అసలు మనిషాలోచనే వంటరిది.....................

  • Title :Manchu Poovu
  • Author :Kasibatla Venugopal
  • Publisher :Anvikshiki Publications
  • ISBN :MANIMN5984
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :125
  • Language :Telugu
  • Availability :instock