ప్రస్తావన
గోదావరి గలగలా ప్రవహిస్తోంది. గోల్డ్క్ సిగరెట్ కాలుస్తున్న కవి కుమారునికి ఆ పొగ ఘుమఘుమగానే వున్నట్టుంది. గోదావరి గట్టు గచ్చు చప్టా మీద ఏడెనిమిదిమంది మిత్రులు కూర్చున్నారు. వాళ్ల మధ్య మౌనం రాజ్యమేలుతోంది. వాళ్లు గోదావరి వంక చూస్తున్నారను కుంటే నీళ్లల్లో మందు పోసినట్టే. వాళ్ల కళ్లు శూన్యంలోకి చూస్తున్నాయి. ఓ పావు గంట గడిచింది.
'శ్రీశ్రీ ఓ సినిమాలో అన్నట్టు... ఈ జీవితాలు ఎగరేసిన గాలిపటాలు, కనిపించని చెయ్యేదో విసిరేసిన జాతకాలు' అన్నాడు. కొటేషన్రావు. (అతని అసలు పేరు కోటేశ్వరరావు)........