• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mandukyopanishat

Mandukyopanishat By Nori Bhogiswara Sharma

₹ 400

అభినందన మందారం

- డాక్టర్ చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ, ఎమ్.ఎ.

వ్యాకరణ వేదాన్త విశారదులు

బ్రహ్మశ్రీ మంత్రమూర్తులు తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రి గారు గత శతాబ్దిలోని తెలుగు ప్రాంతంలో వెలసిన మంత్రయోగి వారి దగ్గర మంత్రదీక్ష పొందిన భాగ్యం బ్రహ్మశ్రీ నోరి భోగేశ్వర్మ సోమయాజి గారిది. వ్యాకరణవేదాంత శాస్త్రాలకు జీవితాన్ని ధారపోసిన విద్యామూర్తి బ్రహ్మ శ్రీ పరిమి విశ్వనాథశాస్త్రి మహోదయుల సన్నిధిలో శాస్త్రాధ్యయనము చేసిన అదృష్టము వీరిది. బంగారమునకు తావి అబ్బినట్లు విద్యకు అనుష్ఠానమును తోడుచేసుకొని సోమయాజి కూడ అయిన వీరు శతాధిక గ్రంథకర్త అవ్వడం మరోభాగ్యం.

అద్వైతోపనిషత్తులో మహోజ్జ్వలమయిన "మాండూక్యోపనిషత్తు"ను వీరనువదించి వేదాంత ప్రియులకు ఉపదగా చేయుట మోదకారకము. దీనిలో వీరు అజపా గాయత్రీ మంత్రానుష్ఠానము, కైవల్యోపనిషత్సంగ్రహాలు కూడా చేర్చారు. పదచ్చేదం, టీకా, తాత్పర్యం, దానిలో ఉదహరింపబడిన శ్రుతులకరము, వివరణము మొదలయిన వాటితో ఈ గ్రంథాన్ని అలంకరించి ప్రశంసాపాత్రులయినారు.

ఈ కాలంలో ప్రాచీనగ్రంథాలు కనుమరుగవుతున్నాయి. పాశ్చాత్య విద్యాప్రభావం వల్ల ప్రాచీనార గ్రంథాలు ముద్రించేవారు, చదివేవారు, అధ్యాపనం చేసేవారు అరదుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో గౌడపాద కారికలతో కూడా మాండూక్యోపనిషత్తును తాత్పర్యాదికంతో వ్రాయడం, ముద్రించడం చాలా శ్రమావహమైన పని.

మాండూక్యము జటిలము. కారికలు మరీ జటిలాలు. ఇవి వృద్ధులు కూడా చదువుకోవడానికి వీలుగా వీరు పెద్ద అక్షరాలతో ముద్రించి అందిస్తున్నారు. ఇది వేదాంతప్రియులు రెండు చేతులతో అందుకోదగిన కానుక.

ప్రసక్తానుప్రసక్తంగా దీనిలో శ్రీశుకుల ప్రస్తావం వచ్చింది. శ్రీ శుకాచార్యులు ఉపనీతులు కాకుండానే ఇంటిని వీడివెళ్ళిపోయారని చెప్పుకోవడం లోకంలో కద్దు. వారికి పార్వతీపరమేశ్వరులు ఉపనయనం చేసినట్లు మహాభారతంలో ఉంది........................

  • Title :Mandukyopanishat
  • Author :Nori Bhogiswara Sharma
  • Publisher :Nori Bhogiswara Sharma
  • ISBN :MANIMN6484
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :414
  • Language :Telugu
  • Availability :instock