• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Manikonda Chalapathi Rao

Manikonda Chalapathi Rao By Amaraiah Akula

₹ 225

అంబఖండి నుంచి అలహాబాద్ వరకు

అమరయ్య

1983 మార్చి 25... న్యూఢిల్లీ.. రోజూ మాదిరే తెల్లారింది. మునిమాపు వేళ వాకింగ్ కి బయలుదేరిందో ఓ పాత్రికేయ శిఖరం. అలా కొన్ని మైళ్లు నడిచి వెళ్ళి కాకానగర్ లోని ఓ టీ బంక్ దగ్గర ఒకటో రెండో టీలు తాగి మళ్లీ కాలినడకన తన గూటికి చేరడం ఆయన దినచర్య. కానీ ఆ రోజు అలా జరగలేదు. టీ స్టాల్ వద్ద కుర్చీలో కూర్చున్న మనిషి కూర్చున్నట్టే తలవాల్చాడు. ఇక ఆ మనిషి తిరిగి లేవలేదు. ఎవ్వరూ గమనించలేదు. ఎంతసేపటికీ ఆ మనిషిలో చలనం లేదు. . ఆ టీ కొట్టు యజమాని యాదవ్ సింగ్ మరి కొందరిసాయంతో ఎంసీని ఓ మంచంపై పడుకోబెట్టి డాక్టర్ కి కబురంపారు. డాక్టర్ వచ్చి పరీక్షించారు. ఫలితం లేకపోయింది. ఢిల్లీ తిలక్ మార్గ్ పోలీసు స్టేషని కి ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు వచ్చారు. భౌతికకాయాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి మార్చురీలో పెట్టారు. అప్పుడు సాయంత్రం ఆరున్నర దాటింది. కాకా నగర్ ఏరియాలో చాలామంది పాత్రికేయులు ఉన్నప్పటికీ, ఏ ఒక్కరికీ విషయం తెలియలేదు. పోలీసులూ గుర్తు పట్టలేదు. ఆయన జేబులు వెతికినప్పుడు 167.50 రూపాయల నగదు, ఒక తాళం చెవి, రెండు కళ్ల జోళ్లు దొరికాయే తప్ప గుర్తింపు కార్డు లేదు.. భౌతిక కాయాన్ని మార్చురీకి తరలించి అప్పటికే దాదాపు 24 గంటలు దాటింది.

అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ. రోజుకోసారైనా ఆయన యోగక్షేమాలు తెలుసుకునే ఐదారుగురిలో ఆమె ఒకరు. ఆవేళ ఆయన ఎక్కడా అందుబాటులోకి రాలేదు. తన సహాయకుల్ని ఇంటికి పంపించారు.................

  • Title :Manikonda Chalapathi Rao
  • Author :Amaraiah Akula
  • Publisher :Sri Miriyala Venkatarao Foundation
  • ISBN :MANIMN6088
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :216
  • Language :Telugu
  • Availability :instock