• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

MANIMN3363

MANIMN3363 By P Chandra Shekar Azad

₹ 120

సాహిత్యం సమకాలీన చరిత్రని కూడా నమోదు చేస్తుంది. ఈ నవల సమకాలీన సమాజపు పోకడ మీద ఒక సుదీర్ఘమైన వ్యాఖ్య. ఈ రచయిత 'విపరీత వ్యక్తులు' అని పేరు పెట్టాడు. కానీ ఇందులో ప్రధాన పాత్ర 'గౌతమ్'ది.

రెండవ అధ్యాయం అంతా ప్రధమ పురుషలో ఉంటుంది. గౌతమ్ మాటల్లో, గౌతముడు సకల కళా వల్లభుడు కాదు. అతనికి సంగీతం వచ్చు, సాహిత్యంలో మునిగి తేలాడు. ప్రాపంచిక విషయాల మీద కుతూహలం కొద్ది దేశమంతా తిరిగాడు. స్వామిజీలతో కలిసి జీవించాడు. వాళ్ళతో కలిసి గంజాయిని ఊపిరిగా తీసుకున్నాడు.

తన చుట్టూ ఉన్న వాతావరణం, ప్రజలు, వారి ఆవేశ కావేశాలు, వారి అభి ప్రాయాలు, వారి జీవన శైలి, భుక్తి కోసం, గుర్తింపు కోసం పడుతున్న పాట్లు, వాటిల్లో తన జీవిత కాలంలో చూసిన మార్పులు, చేర్పులు గురించి, తన మీద వాటి ప్రభావం గురించి ఈ నవల నడుస్తుంది. ఈ నవలలోని పాత్రలన్నీ కూడా ఈ సమాజంలోని “విపరీత వ్యక్తులు' అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుంది?

ముఖ్యంగా తెలుగు సాహితీ రంగంలో ఉన్నవారికి. ఆ క్షేత్రంలో ఎదగాలనుకుంటున్న ఎదిగిన, ఎదుగుతున్న గడ్డి పరకలు, చెట్లు, చేమలు, వృక్షాలు, మహా వృక్షాలు తెలిసిన వారికి, వాటి గురించి విన్నవారికి, చూసిన వారికి, ఫెటిల్లున విరిగి కిందపడి మట్టిలో కలిసిపోయిన వారిని కూడా గుర్తు పట్టగలరు- రేఖామాత్రంగానైనా..

అంత మాత్రం చేత ఇది తెలుగు వారికి మాత్రమే చెందినది కాదు. కళ్ళున్నవారందరికి, చెవిటితనం లేని వారందరికి కూడా ఇది ఈ ప్రపంచానికి చెందినదిగా కనపడుతుంది, వినపడుతుంది.........

  • Title :MANIMN3363
  • Author :P Chandra Shekar Azad
  • Publisher :Janaki Azad Prachuranalu
  • ISBN :MANIMN3363
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock