₹ 180
ఈ రోజు మనం నడుస్తున్న ఈ వైజ్ఞానిక ప్రగతిబాట యుగాలను దాటి, ఎంతో మంది నీతి,నిజాయితీపరులు, త్యాగధనులు అయిన పరిశోధకుల మృత కళేబరాలను చుట్టి రక్తకేతనాలను ఎగరేస్తూ వచ్చిందని పొరపాటున కూడా మరువకూడదు! ఎక్కువమంది నమ్మే అబధం ఏనాటికి సత్యంగా మారిపోదు. వారు అలా అబద్దాన్ని నమ్మడానికి అవగాహనా రాహిత్యమౌ, అమాయయకత్వమౌ - కారణం కావొచ్చు. తక్కువ మంది నమ్మినంత మాత్రాన సత్యం ఎప్పటికి అబద్దం కాదు. సత్యం - ఎప్పుడు ఒకటే వుంటుంది. నమ్మేవారి సంఖ్యను బట్టి అది మారిపోదు. సైన్సుకు అందని అతీతమైన శక్తీ వుందని జనాన్ని ఉదరగొట్టే వారు తాము చేసే పనులన్నింటికీ తమ అతీతశక్తిని మాత్రమే ఉపయోగించుకుని బతకగలరా? సైన్సు జ్ఞానాన్ని గాని, సైన్స్ పరికరాల్ని గాని, సైన్సు ఉత్పత్తులను గాని ఏ మాత్రం వాడకుండా కనీసం శ్వాసించగలరేమౌ.... ఆత్మవిమర్శ చేసుకోవాలి.
- Title :Manishi- Matham- Vignyana Saasthram
- Author :Dr Devaraju Maharaju
- Publisher :Visalandhra Publications
- ISBN :MANIMN0790
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :216
- Language :Telugu
- Availability :instock