₹ 54
బాపూజీ భారతదేశానికె కాదు, ప్రపంచానికే ముద్దుబిడ్డ. గాంధీజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రేరణ పొందిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా వంటి మహనీయులు తమ జాతి బానిసత్వాన్ని పారద్రోలడానికి చేసిన కృషి మరువలేనిది.
గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్ముని స్మరించుకోవడం మనందరి బాధ్యత.
మహాత్ముని గురించి చెప్పుకోవడం మానవజాతి భాగ్యం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మానవతామూర్తులలో మొదటిస్థానంలో ఉండే బాపూజీ వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ప్రయత్నించడం సాహసమే అవుతుంది. అందులోను విశేషించి బాలలకు అర్ధమయ్యేలా చెప్పడం కత్తిమీద సామె.
ఈ సామును అలవోకగా నడిపించారు గజ్జెల దుర్గారావుగారు. తేలిక శైలిలో సూటిగా, స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసారు రచయిత దుర్గారావుగారు.
- Title :Manishi Nundi Mahatmuni Varaku
- Author :Sri Gajjela Durgarao
- Publisher :S.R.BooksLinks
- ISBN :MANIMN0698
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :instock