మార్క్స్ సిద్ధాంతం ఆచరణ సాధ్యమైన ఏకైక, అతి గొప్ప మానవవాద సిద్ధాంతం. ఎందుకంటే మానవతావాదాల్లా ఇది దోపిడీ వర్గాలు చెప్పే నీతుల మీద, ఊహా కల్పిత ఆశయాలు, ఆదర్శాల మీద నిర్మించినది కాదు. వేల సంవత్సరాల నుండి ఈ మానవతావాదాలు, నీతులు విఫలమవుతూ వచ్చాయి. మార్క్స్ చెప్పిన మానవవాదం నేడు బాగా ప్రచారంలో ఉన్న మానవతావాదం వంటిది కాదు. అలా కాకపోగా ఒక విధంగా దానికి విరుద్ధమైనది కూడా! మార్క్స్ మానవవాదం అన్నదానం గొప్పదని అంగీకరించదు. అన్నాన్ని దానంగా స్వీకరించడం అనేది ఆ అన్నాన్ని తినేవారితో పాటు సాటి మానవులు అటువంటి పరిస్థితిలో ఉండటం
మొత్తం మానవాళికే అవమానకరమని భావిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి గురించి మార్క్స్ చేసిన లోతైన విశ్లేషణను తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఆ విశ్లేషణను సంక్షిప్తంగా పరిచయం చెయ్యడమే ఈ చిన్న పుస్తకం ఉద్దేశం.
డా॥ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ
రామచంద్రపురం-533255