"మీరు పుట్టినప్పుడు, ప్రపంచం ఆనందిస్తుంటే మీరు ఏడ్చారు. మీరు ఎలా జీవించాలంటే, మీ మరణానంతరం మీరు ఆనందిస్తుంటే ఈ ప్రపంచం ఏడవాలి."
పైన చెప్పిన రత్నంలాంటి వాక్కు మిమల్ని కదిలించిందా? మీకు ఎంత అర్హత ఉందో అంత ఆనందాన్ని, అర్ధాన్ని పొందకుండానే జీవితం కరిగిపోతున్నదనే భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? అలాగైతే, రాబిన్ శర్మ రాసిన ఈ పుస్తకం మీకు మార్గదర్శకత్వం చేస్తుంది. ది మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెరారి పుస్తకం రాసి, వేలాదిమంది జీవితాలను మెరుగుపరచిన వ్యక్తిత్వ వికాస గురువు రాబిన్ శర్మ రచన ఇది. గంభీరమైన విజ్ఞానాన్ని అందించినప్పటికీ, హాయిగా చదివించే ఈ పుస్తకంలో రాబిన్ శర్మ జీవితంలోని అతి క్లిష్టమైన సమస్యలను 101 సులభ పరిష్కారాలను చూపించారు. ఒత్తిడిని తట్టుకోవడం దగ్గర్నుంచి, మీ వారసత్వం వదిలే ప్రస్థానంలో మీరు పొందగల ఆనందం వరకూ ఆయన ఎన్నో విషయాల్లో మీకు మార్గం చూపించారు.
నేడు ప్రపంచంలో అత్యంత ప్రముఖ రచయితల్లో రాబిన్ శర్మ ఒకరు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఆయన పదకొండు పుస్తకాలు (మిలియన్ల కొద్దీ కాపీలు అమ్ముడు పోయాయి) 65 పై చిలుకు దేశాల్లో 75 భాషల్లో. అత్యంత ప్రభావితం చేసే బ్లాగర్, సోషల్ మీడియా సెలిబ్రిటినేకాక, రాబిన్ మంచి పేరెన్నికగన్న వక్తకూడా.
- రాబిన్ శర్మ