• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Manishilo Marmam

Manishilo Marmam By Ravulapati Sitaram Rao

₹ 75

మనిషిలో 'మర్మం'

అంతా కొత్తగా వుంది. అప్పటిదాకా వున్న వెచ్చదనం పోయింది. చల్లదనం వళ్ళంతా తాకుతున్నది. లోపలవున్నప్పుడు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు లోపల్నుంచి. తన లోపల్నుంచి ప్రతిసారీ ఏదో చెబుతున్నది. తను ఏమిటో తనకు తెలియదు. బాగా అటు యిటూ చూసాడు. అన్నీ రంగులు కనపడుతున్నాయి. తనకు ఏదో అవుతున్నది. అది ఆకలి అని - అట్లా అనిపించినప్పుడు తను ఏడవాలని తర్వాత తర్వాత తెలిసింది. కాని యిప్పుడు లోపల తనకు వెచ్చదనం యిచ్చినట్లుంది మళ్లీ.. తనను లోపల యిముడ్చుకున్నట్లు యిప్పుడూ యిముడ్చుకుంటూ కడుపు నింపుతున్నది! తనకు కడుపు అనేది వుందని చాలా చాలా రోజుల తర్వాత తెలిసింది!

"అరేయ్! మీ అమ్మరా! పాలుత్రాగు” కొత్త శబ్దాలు వినపడుతున్నాయి. మూసుకున్న కళ్ళు తెరుచుకున్నాయి. ఆ కళ్ళతో బయటి ప్రపంచం చూస్తున్నానని తనలోంచి ఎవరో చెబుతున్నట్లు అర్థం అవుతున్నది! మళ్ళీ కళ్ళు మూసుకొని పోతున్నాయి. హాయిగా అనిపిస్తున్నది - ఆ హాయితనం నిద్ర అని తనకు లోపల్నుంచి. ఎవరో చెబుతున్నారు.

“నిద్రపోతున్నట్లుంది. ఊయలలో వేయండి"

ఏమిటి? హాయిని చెడగొట్టూ ఏదో తొట్టెలాంటిదాంట్లో వేస్తున్నారు!? ఆ తొట్టె ఊయల అని తర్వాత లోపల్నుంచి ఎవరో చెప్పారు. మళ్లీ హాయితనం పోయింది. కానీ పైన రంగు రంగుల వేమిటో కనపడుతున్నాయి. సంతోషంగా వుంది! సంతోషం అంటే ఏమిటి? తర్వాత తెలిసింది - అది హాయితనంకంటే బాగా వుంటుందని! నిద్రలాంటిది - అదే హాయిగా వుండటం కలుగుతున్నది. నీకు నిద్ర పట్టున్నది - లోపల్నుంచి ఎవరో చెబుతున్నట్లు అనిపిస్తుంది! రంగుల బొమ్మలు యిప్పుడు కనపడటంలేదు! తనలోపల ఎవరు వున్నారు?

తను అనుకుంటున్న తను - ఎవరు?...........................

  • Title :Manishilo Marmam
  • Author :Ravulapati Sitaram Rao
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6601
  • Binding :Papar back
  • Published Date :Nov, 2025
  • Number Of Pages :102
  • Language :Telugu
  • Availability :instock