శ్రీ గురుభ్యో నమః
గం గణపతయే నమః
ఓం శ్రీసాయిరామ్ గురుదేవదత్త
మంత్ర మహార్ణవము
మొదటి తరంగం
తొలి ఆశ్వాసము
గాయత్రి తంత్రము
శ్లో॥ అధవేదాది గీతాయాః ప్రసాద జననం విధిమ్|
గాయిత్ర్యాః సంప్రవక్ష్యామి ధర్మార్ధ కామ మోక్షదమ్||
బ్రహ్మ గాయత్రి పురశ్చరణ విధానము :
నిత్య నైమిత్తికామ్య తపోవృద్ధికై మరియు ఇహలోక పరలోకములలో శ్రేష్ఠమైనది గాయిత్రికన్నా మరేమిలేదు. వేదములు గీతాదులలో చెప్పబడిన గాయిత్రి ధర్మార్థ కామ మోక్షాలను గాయత్రి పురశ్చరణ చెప్పబడుచున్నది. దేవి భాగవతంలో ఈ విధంగా చెప్పబడినది.
శ్లో॥ అధాతః శ్రూయతాం బ్రహ్మన్, గాయిత్ర్యాః పాపనాశనమ్।
పురశ్చరణకం పుణ్యం యధేష్ఠఫలదాయికమ్||
పాపనాశని, యదేష్ఠ (కోరిన కోర్కెలు తీర్చు ఫలదాయిని ఐన పుణ్య గాయిత్రి మంత్ర పురశ్చరణ గూర్చి తెలిపెదవినుము.
శ్లో॥ పర్వతా.... సంశయిః|
పర్వత శిఖరాలపైన నదీతీరంలో బిల్వవృక్షము క్రింద జలాశయాల్లో గోశాలల్లో దేవాలయంలో రావిచెట్లు నీడలో, తోటల్లో, తులసివనంలో, పుణ్య క్షేత్రాలలో గురుసన్నిధిలో ఎక్కడైతే మనస్సు ఏకాగ్రత పొందగలుగు తుందో అట్టి స్థలాలలో గాయిత్రి పురశ్చరణ చేసిన మంత్రసిద్ధి కలుగుతుంది అనుటలో ఎట్టి లేశమాత్రమైనా సందేహములేదు..................