Logili Books

Literature

Manucharitra

By Sri Timmavajala Kodanda Ramaiah

₹240
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Manucharitra
Publisher
Suravaram Prathapareddy Telugu Viswa Vidyalayam
ISBN
MANIMN6818
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
250
Language
Telugu
Availability
In Stock
About this book

ఉపోద్ఘాతము

ఆంధ్రసాహిత్యచరిత్రలో రాయలయుగము స్వర్ణయుగ మని కీర్తిగాంచి నది. రాయల యేలుబడిలో నాంధ్రకవిత్వము మూఁడు పూవు లారుకాయలుగా వర్ధిల్లినది. కొంగొత్త తీరుతీయముల సంతరించుకొనినది. క్రొత్తపోకడలు వెలా రినది. తెలుఁగు కవితకు పెండ్లి పందిళ్లు వెలసిన కమనీయ కాలమది. సాహిత్య మీమాంసలతో, సారస్వత చర్చలతో, కవితాగోష్ఠులతో, కవిపండిత 'సమ్మాన నము లతో రాయల యాస్థాన మానాఁడు కలకలలాడి పోయినది. తెలుఁగుకవి యానాఁడు పొందినవైభవమును, గౌరవమును మఱి యేకాలములోను బొందియుండలేదు. దక్షిణాపథము నంతను రాజకీయముగా మాత్రమే కాక సాంస్కృతిక ముగా ఁ గూడ నేకము చేసినకీర్తి సమరాంగణ చక్రవర్తి మాత్రమే కాక సాహితీ సార్వ భౌముఁడు నయిన శ్రీకృష్ణదేవరాయలకే చెందవలసి యున్నది. అట్టి రాయల యాస్థానిలోఁ దెలుఁగుతల్లి గజ్జెకట్టి నాట్యము చేసినది. అష్టదిగ్గజములను దన యాస్థానిలో నలంకరించుకొని యతఁడు తన సాహితీరసికతను బ్రకటించుకొని నాఁడు. అలనాఁటి సాహిత్యగోష్ఠులకు రంగభూమి యాతని 'భువనవిజయ' సభా భవనము. భువనవిజయ సభాప్రవేశము, రాయలవారి మెప్పు - ఇవి రెండే యల నాఁటి యాంధ్రకవీశ్వరుల యాదర్శములు. అవి పడయుటయందే వారికిఁ జరి తాత! రాయల యాస్థాని నలంకరించిన కవీశ్వరులును సామాన్యులు కారు. హేమాహేమీ లయిన కవీశ్వరులే యతని యాస్థాని నలంకరించియుండిరి. వారిలో నెవ్వరును నొకరికొకరు తీసిపోవువారు కారు. స్వయము కవిత్వము చెప్పనేర్చిన 'కవితా ప్రావీణ్యఫణీశుఁ డగురాయలవారికిఁ దమ కావ్యముల నంకితము చేయఁ గలుగునదృష్టము కూడ వారిలోఁ గొందఱకుఁ బట్టినది. అట్టి రాయల కాలమున వెలసిన కావ్య రాజములలోఁ దలమానిక మై యాతనికే యంకితము చేయఁబడిన యుత్తమ ప్రబంధము 'మనుచరిత్రము'.

గ్రంథప్రాశ స్త్యము

సంస్కృతభాషా ప్రారంభకులకు రఘువంశాది సంస్కృత పంచకావ్యము c కువలెనే యాంధ్రభాషాధ్యయనపరులకు నుపాధేయములయిన యాంధ్రపంచ......................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?