మనుస్మృతి
ప్రథమాధ్యాయము
శ్లో. 1. మనమేకాగ్ర మాసీన మభిగమ్య మహర్షయః |
ప్రతి పూజ్య యథాన్యాయ మిదం వచన మబ్రువన్ ||
శ్లో. 2. భగవన్సర్వ వర్ణానాం యథావదనుపూర్వశః ||
అంతరప్రభవాణాం చ ధర్మాన్నో వక్తు మర్హసి ॥
శ్లో. 3. త్వమేకో హ్యస్య సర్వస్య విధానస్య స్వయంభువః |
అచిన్త్య స్యాప్రమేయస్య కార్యతత్త్వార్థవిత్ప్రభో ॥
అర్థము: ఏకాంతమున విరాజిల్లుచున్న మనువు సమీపమునకు మహర్షులు వచ్చి, యథోచితరీతిని పూజలొనరించి "జ్ఞాన వైరాగ్య కీర్తి సంప్రదాయాదులతో విరాజిల్లు మహాత్మా! సర్వవర్ణములు, మఱియు వర్ణసంకరములు, వాటి ధర్మము, యథాక్రమముగ మాకుపదేశించుటకు నీవొక్కడవే సమర్థుడవు. అచింత్యాప్రమేయ పరమేశ్వర విధానమును యథార్థముగ వేదముల నుండి గ్రహించిన కారణమున నిన్ను మేము ప్రార్ధించుచున్నాము" అని పల్కిరి.
శ్లో. 4. స తైః పృష్టస్తథా సమ్యగ మితౌజా మహాత్మభిః |
ప్రత్యువాచార్చ్యం తాన్సర్వాన్మహర్షీ శ్రూయతా మితి ||
అర్థము: ఆ మహాఋషులను సత్కరించి, మనువు వారి ప్రశ్నకు సమాధానము క్రింది విధముగా ప్రారంభించుచున్నాడు..
శ్లో. 5 ఆసీదిదం తమోభూత మప్రజ్ఞాత మలక్షణమ్ |
అప్రతర్క్య మవిజ్ఞేయం ప్రసుప్తమివ సర్వతః ॥.............