• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Manuvada Bhavajalam

Manuvada Bhavajalam By Pro K S Chalam

₹ 100

పునరుద్దరింపబడుతున్న భూస్వామ్య సంస్కృతి

సామాజిక శాస్త్రాలు అధ్యయనం చేసేవారికి చారిత్రక పరిణామంలో విభిన్న వ్యవస్తల ఆవిర్భావం గూర్చి తెలిసేవుంటుంది. దాన్నే మార్క్స్ ఉత్పత్తి విధానాలుగా పేర్కొని సుమారుగా 5 రకాల విధానాలను, ఆసియా ఉత్పత్తి విధానంతో కలుపుకొని పేర్కొన్నాడు. ఉత్పత్తి విధానాన్ని ఒక పరిశోధక పనిముట్టుగా స్వీకరించి పరిశోధనలు చేసినవారు అనేక గ్రంధాలు, వ్యాసాలు యిప్పటికే ప్రచురించివున్నారు. అందులో భాగంగా ఎన్నో విమర్శలు ప్రతివిమర్శలు వున్నాయి. ప్రధానంగా యీ ఉత్పత్తి విధానాలు ఒకదాని తరువాత ఒకటి వచ్చును, అన్నదాంట్లో ఒక విధానం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన తరువాత యింకొకటి వస్తుంది, అన్న దానికి సరైన వివరణ లేదు. ఎందుచేతనంటే రెండు లేక మూడు ఉత్పత్తి విధానాలు సమాంతరంగా ఒకే దేశంలో మనుగడ సాగించే పరిస్తితివుంది.

మన దేశంలో ఆదివాసి ప్రాంతంలో ఒక విధానం, ఆంధ్రాలో కోస్తాతీరం, పట్టణ ప్రాంతం యిలా విభజించుకుంటూ పోతే పరిశీలన కోసం కొన్ని ప్రత్యేకతలు కనిపించవచ్చు. గాని యిప్పుడు వీటన్నింటిని ప్రభావితం చేసే రాజ్యవ్యవస్త దేనికి అనుకూలంగా వుందో అన్నది కూడా చూడవలసి వస్తుంది. ఉదాహరణకు కేంద్రంలో కార్పోరేట్ పెట్టుబడి దారి వ్యవస్త ద్వారా ఆర్ధికరంగాన్ని నియంత్రిస్తూ, రాజాకీయ, సాంస్కృతిక రంగంలో భూస్వామ్య లేక పెట్టుబడిదారి పూర్వ రంగ ఉత్పత్తికి సంబంధించే ఆలోచనలు కలిగివుండడం వైరుధ్యంగా కనిపిస్తున్నా యిప్పుడు మనగలుగుతున్నాయి. అందుకే లెనిన్ వంటి వారు సామ్యవాదం వైపు అడుగులేసినప్పటికీ, భూస్వామ్య అవశేషాలను ఏరిపారేయాలనే పిలుపు యివ్వటం, మావో చైనాలో ఓ పెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని నడపడం చరిత్రలో చూశాము. మరి భారతదేశం లో అటువంటి ఉద్యమాలు, విభిన్న సంస్కృతులున్న దేశంలో క్రియాశీలకంగా ఆలోచించి పాతవాసనల నుండి కార్యకర్తలను వేరుచేసే ప్రయత్నాలు లేని పరిస్తితుల్లో పాత పద్ధతులు తిరగబడటంలో వింతేమి లేరు. పైగా అవన్నీ చిన్న విషయాలు, ఆర్థిక విప్లవంతో అన్నీ సర్దుకుంటాయనే ఉదాసీనత ఎంతవరకూ వెళ్లిందో యిప్పుడు దేశంలో జరుగుతున్న తంతు చూస్తే అర్ధమవుతుంది...........

  • Title :Manuvada Bhavajalam
  • Author :Pro K S Chalam
  • Publisher :Bhoomi Book Trust
  • ISBN :MANIMN5329
  • Binding :Papar Back
  • Published Date :2022 first print
  • Number Of Pages :93
  • Language :Telugu
  • Availability :instock