ఓ కూతురితో ఓ తండ్రి ఆర్థికవ్యవస్థ గురించి జరిపిన మాటామంతీ
మేధావులకే సంబంధించిన విషయం అనుకుంటాం ఆర్థిక వ్యవస్థ.
కానీ అందరి జీవితాలనూ ప్రభావితం చేసే ఆర్థిక విధానాల గురించిన ఎలాంటి చర్చ అయినా ఆ కొద్దిమంది నిపుణులకే ఎందుకు వదిలేయాలి? తన పదకొండేళ్ళ కూతురు జెనియాతో
యానిస్ ఆసక్తిగా జరిపిన మాటల ముచ్చటే ఇది. లోకంలో అసమానతలు ఎందుకు ఉన్నాయి? ఈ సాంకేతిక అభివృద్ధి, కృత్రిమ మేధస్సు వెంట మనం పెడుతున్న ఈ పరుగులో ఇక యంత్రాలే అంతిమంగా మనల్ని బానిసల్ని చేస్తాయా? ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపాలంటే ఎట్లా? పర్యావరణాన్ని మార్కెట్ కి పణంగా పెట్టక తప్పదా? పురాణ గాథలు, సాహిత్యం, సినిమాలని ఉదాహరణలుగా చెబుతూ హాయిగా మనకు అర్థం అయ్యేట్టు రాసిన మర ముచ్చట తప్పక చదవాలి. మర ముచ్చట
యానిస్ వేరూఫెకిస్