* "జర్మన్ పెట్టుబడిదారీ వర్గానికి భావ ప్రతి నిధులుగా వున్న మేధావులూ, సామాన్యులూ కాపిటల్ ని తమ మౌనంతో, నిశ్శబ్దంతో చంపాలని మొదట ప్రయత్నం చేశారు. గతంలో, నా తొలి రచనల విషయంలో అలా చెయ్యగలిగారు గానీ, ఈ మారిన కాలానికి ఆ ఎత్తులు సరిపోవని, నా పుస్తకాన్ని విమర్శించే పేరుతో, దాని మీద రాతలు మొదలు పెట్టారు.” (1867లో 'కాపిటల్ జర్మన్ ముద్రణకుమార్క్సరాసిన
“ముందు మాట' నించీ)
* “కాపిటల్ లో వున్న సిద్ధాంతాన్ని గత కొన్నేళ్ళుగా ఎంత గానో చర్చించారు, ఖండించారు, సమర్ధించారు, సరిగా అర్ధం చేసుకున్నారు, తప్పుగా అర్ధం చేసుకున్నారు. ఇంగ్లండులోనూ, అమెరికాలోనూ పత్రికలూ, పుస్తకాలూ, ఈ పని చేశాయి.” (1886లో 'కాపిటల్ ఇంగ్లీషు ముద్రణకు ఎంగెల్స్ రాసిన 'ముందు మాట' నించీ).
* మార్కుృ తన కాలంలో అందరికంటే యెక్కువగా ద్వేషించబడిన, నిందించబడిన వ్యక్తి. ప్రభుత్వాలు - నియంతృత్వపువీ, రిపబ్లికన్ వీ రెండూ - తమ భూభాగాల నుండి బహిష్కరించినాయి. బూర్జువాలు- మితవాదులైనా, అధి ప్రజాతంత్రవాదులైనా- ఆయన మీద నిందలు గుప్పించడంలో ఒకరితో ఒకరు పోటీ పడినారు. - ఎంగెల్స్ (1883 మార్చిలో మార్కు చనిపోయినప్పుడు.) *