విజ్ఞప్తి
ప్రపంచాన్ని మార్చాలి అనే కారల్ మార్క్స్ నినాదం వెనుక తరతరాలుగా మానవాళి మెరుగు పరుచుకుంటూ వస్తున్న సాంఘిక వ్యవస్థలను బలవంతంగా కూలదోయాలనే దుర్మార్గమైన కుట్ర దాగివుంది.
-
తన ముందుతరం మరియు తన సమకాలీన చింతనాపరుల కృషిని వక్రీకరించి, ఇంతవరకూ తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలుగా వ్యాఖ్యానించడం మాత్రమే చేశారని వ్యాఖ్యానించి వారి తపనను, కృషిని మరుగుపరిచేందుకు కారల్మార్క్స్ ప్రయత్నించాడు. తమదే సర్వ సమగ్రమైన, శాస్త్రీయ సిద్ధాంతమంటూ, హింసాయుత మార్గం ద్వారా నియంతృత్వ వ్యవస్థను నెలకొల్పేందుకు మార్క్స్ ఎంగెల్లు విధ్వంసక సిద్ధాంతం సృష్టించారు.
ప్రకృతిని, మనిషిని, మానవ సమాజాన్ని అర్థం చేసుకోకుండా....
ప్రకృతిని పరిసరాలకు కుదించి,
శాస్త్రీయవిజ్ఞానాన్ని చరిత్రకు కుదించి,
ప్రపంచచరిత్రను యూరప్ చరిత్రకు కుదించి,
మానవసారాన్ని శ్రమకు కుదించి,
మానవచైతన్యాన్ని భావాలకు, ఆలోచనలకు, అభిప్రాయాలకు
మొత్తంగా భాషకు కుదించి,
మనుషుల మధ్య అనుబంధాలను ఆర్థిక సంబంధాలకు కుదించి,...............