• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Marxism- Sahitya Vimarsa

Marxism- Sahitya Vimarsa By Terry Eagleton , Gudipudi Vijayarao

₹ 75

                 ఎంగెల్స్ ఒక చోట చెప్పినట్లు సామాజిక గమనాన్ని నిర్దేశించేది అంతిమంగా ఉత్పత్తి, పునరుత్పత్తి, అంటే ఆర్థికవ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ ఒక్కటే అంతా నిర్దేశిస్తుందని మార్క్స్ కాని, నేను కాని చెప్పామని ఎవరైనా అంటే, మార్క్సిజాన్ని అర్థంలేని, రూపం సారం లేని మాటగా మార్చివేసినట్లే అన్న దాన్ని ఈగలన్ అనుసరిస్తాడు. ఉపరితలంలోని ప్రతి అంశానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, తనకంటూ ప్రత్యేకమైన చరిత్ర, అభివృద్ధి నియమాలు ఉంటాయి అని ఈగటన్ చెబుతాడు. సాహిత్యం ఉపరితలంలో భాగం అవ్వొచ్చు, కాని అది క్రియాశీల రహితంగా పునాదిని ప్రతిబింబించదు అని అంటాడు. రూట్లేడ్జ్ సులభ పరిచయాల సీరీస్లో భాగంగా 2002లో వెలువడిన ఈ రచన మార్క్సిస్టు సాహిత్య విమర్శను క్లుప్తంగా, శక్తివంతంగా పరిచయం చేస్తుంది. ఇప్పటివరకు తెలుగువారికి అంతగా పరిచయంలేని అంశాలు దీనిలో ఉంటాయి. మార్క్సిస్టు విమర్శపై ఉన్న అపోహలకు ఇది ఒక చక్కటి సమాధానం.

                  టెర్రీ ఈగన్, అంతర్జాతీయంగా పేరుగాంచిన సాహితీ విమర్శకుడు, సాహిత్య, సాంస్కృతిక సైద్ధాంతికవేత్త. మరో ప్రఖ్యాత అంతర్జాతీయ సాహితీ సైద్ధాంతికవేత్త రేమండ్ విలియమ్స్ శిష్యుడు. ఈగలన్, బ్రిటన్లోని ల్యాంకస్టర్ యూనివర్శిటీలో ఇంగ్లీషు ప్రొపెసర్‌గా పనిచేస్తున్నారు. దాదాపు 50 పుస్తకాలు రచించారు. ఆయన ప్రసిద్ధ రచనలు - లిటరరీ థియరీ (1983), ఐడియాలజీ ఆఫ్ ఈస్థటిక్ (1990), ఇల్యూషన్ ఆఫ్ పోస్టమోడర్నిజమ్ (1996), వై మార్క్స్ వాజ్ రైట్ (2011).

  • Title :Marxism- Sahitya Vimarsa
  • Author :Terry Eagleton , Gudipudi Vijayarao
  • Publisher :Navatelangana Publishing House
  • ISBN :MANIMN2585
  • Published Date :2021
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock