₹ 90
ఈ సృష్టికి అంతం మహాప్రళయం ఆ ప్రళయకాలంలో ఈ విశ్వ వ్యాపకత్వమంతా గూడా నశించి పోతుంది. తిరిగి ప్రళయాంతంలో సృష్టి జరుగుతుంది. ఇది భగవన్మాయా నాటకంలో ఒక భాగంగా అలా సాగుతునే వుంటుంది. ఒకానొక సృష్ట్యాది యందు భగవానుడు ధర్మరక్షణకోసం ధరించిన అవతారమే మత్స్య స్వరూపం ఏర్పడటానికి కారణంగా పురాణాలు పేర్కొంటున్నవి.
దేవతలకే గాక ఈ అఖిల విశ్వసృష్టికి మూలము త్రిమూర్తులు. వీరిలో బ్రహ్మజ్ఞాన వేదశక్తి గలవాడై సృష్టిని కొనసాగిస్తుంటాడు. బ్రహ్మవలన ఆవిర్భవించిన సమస్తాన్ని విష్ణువు ఇచ్చా ధర్మ శక్తిచే పోషించే పరిపాలిస్తుంటాడు. నిర్ణయింపబడిన కాల పరిసమాప్తి యందు రుద్రుడు క్రియా తపోశక్తి గలవాడై, సృష్టించబడిన వాటిని తనయందుల యుంచుకొనుచుంటాడు.
- యమ్. సత్యనారాయణ సిద్ధాంతి
- Title :Matsya Yantra Mahima
- Author :M Satyanarayana Siddanthi
- Publisher :Mohan Publications
- ISBN :GOLLAPU393
- Binding :Paperback
- Published Date :2004
- Number Of Pages :88
- Language :Telugu
- Availability :instock