విప్లవాత్మక భావాల విశిష్ట నవల 'మట్టి బతుకులు'
మహాభారతయుద్ధం అనివార్యమని తెలిసి పోయిన తరువాత దుర్యోధనుడు చేసిన మొట్టమొదటి పని యుద్ధంలో తను గెలవడానికి కావల్సిన మంచి ముహూర్తం
ముహూర్తం పెట్టడానికి తన పక్షంలో వున్న మహామహులను కాదని, పంచపాండవుల్లో ఆఖరివాడైన సహదేవుని దగ్గరికి వెళతాడు.
సహదేవుడుకూడా వచ్చినవాడు తన విరోధి అని, అతను గెలవడానికి ముహూర్తం పెట్టడమంటే తాము ఓడిపోవడమేనని తెలిసినా, రారాజు అంతటివాడు. ఉద్దండ పండితులను కాదని తనదగ్గరికొచ్చి గెలుపుకోసం ముహూర్తం పెట్టమని అడగడం తనకు దక్కిన గౌరవంగా భావించాడు. సుయోధనుని గెలుపుకోసం నిజాయితీగా ముహూర్తం పెట్టడానికి పూనుకుంటాడు సహదేవుడు.
అయితే, ఆతని ముహూర్తబలం తప్పిపోవడానికి కృష్ణుడు ఆడిన మాయానాటకం, దానిఫలితంగా జరిగిన పరిణామాలు అదంతా వేరే కథ.
కానీ, ఇక్కడ విషయం ఏమిటంటే? సహదేవుడు ఆనాడు వున్న ఉద్దండ పండితులందరికన్నా వయసులో చిన్నవాడు. అందుకే అతనికింకా లౌక్యంతో కూడిన మాలిన్యం అంటలేదన్న ఎరుకతోనే రారాజు తన కొలువు కూటమిలోని ఉద్దండ పండితులను కాదని కార్యార్థియై సహదేవుని దగ్గరకు వెళతాడు.
అదేవిధంగా రామాయణంలోనూ యుద్ధకాండలో లంకలోని రావణాసురుని బలాబలాలను ఖచ్చితంగా అంచనావేసి, సరి అయిన సమాచారం తీసుకురావాలంటే తన వద్దనున్న పెద్దలందరికంటే యువరాజు అంగదుణ్ణి లంకకు రాయబారిగా పంపడం మంచిదనుకున్న రాముడు అందుకు అంగదుణ్ణి ఎన్నుకున్నాడు.
లౌక్యం తెలిసిన పెద్దవారైతే తన మెప్పుకోసం, తనకు నచ్చే, తను మెచ్చే సమాచారాన్ని మాత్రమే చేరవేస్తారు. ఆ సమాచారం ప్రాతిపదికన రావణునితో యుద్ధానికి దిగితే తనకు ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాబట్టి శత్రువు వాస్తవ బలాబలాలు తెలియాలంటే ఇంకా లౌక్యం అంటని యువరాజు అంగదుడే అందుకు తగినవాడు............