₹ 275
అతడు కళ్ళంట వెలువరించే క్రోధాగ్నికి సభాస్థలమంతా కంపించింది. అతను గర్జించే భయంకర గర్జనలకు భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. మంత్రి, సామంత, దండ నాయకాది ప్రముఖులందరూ గజగజ వొణికిపోయారు. గురువుల కోపకారణం తెలియక, భరద్వాజ మహారాజు, తొట్రుపాటుతో సింహాసనం పై నుంచి లేచాడు. విఠలాచార్యులవారు కొట్టారు, చంపరు. కానీ మహారాజుకు ఆయనయందుడే గురుభావమంతటిది. అందరకూ అయన యందుడే భక్తిభావమటువంటిది.
చిమకయినా చేయ్యని అహింసావ్రతుడు - పరాకునన్నా, పురుషవాక్యం పలుకని సాధు శిరోమణి, పగవారులేని పరమశాంతుడు, ఎన్నడూ అలుగుటయే యేరుగని ఆ సాధుసజ్జునుడనాడు, కళ్ళంట నిప్పులు రాలుస్తున్నాడంటే, అది ప్రళయమేనని అందరూ భయపడ్డారు. ఆయనకంత కోపమెందుకొచ్చిందా అని విభ్రాంతులయినారు.
-కొవ్వలి లక్ష్మీనరసింహారావు.
- Title :Mayalapakeeru
- Author :Kovvali Lakshminarasimharao
- Publisher :Amaravathi Publications
- ISBN :MANIMN0585
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :284
- Language :Telugu
- Availability :instock