₹ 200
పదేళ్లక్రితం "ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం వ్రాస్తున్న సమయంలో మెకంజీ కైఫియ్యతులలో యానాం ప్రస్తావన ఉండొచ్చుననే ఉద్దేశంతో తూర్పు గోదావరి జిల్లా కైఫియ్యతుల పుస్తకం కొరకు వెతికాను. దొరకలేదు. చాన్నాళ్ళక్రితం మిత్రులు శ్రీ పరుచూరి శ్రీనివాస్ ను అడిగితే వారు, తూర్పుగోదవారి జిల్లా మెకంజీ కైఫియ్యతులు పుస్తకరూపంలో ఇంతవరకు రాలేదు అన్నారు. ఆ తరువాత శ్రీనడుపల్లి శ్రీరామరాజు వ్రాసిన "మెకంజీ కైఫియ్యతుల సూచి" పుస్తకం లభించింది. ఆ పుస్తకంలో మెకంజీ కైఫియ్యతులు నేడు ఏ ఏ లైబ్రేరిలలో లభ్యమవు తున్నాయో ఇండెక్స్ నంబర్లతో సహా మొత్తం 2028 వ్రాతపత్రుల వివరాలు సేకరించి క్రీడికరించారు. ఈ పుస్త్తకం వ్రాయటానికి శ్రీరామరాజుగారు చేసిన కృషి నాకు దీక్సూచీలా పనిచేసింది.
- Title :Mekanji Kaifiyyatulu- Thurpu Godavari Jilla
- Author :Bolloju Baba
- Publisher :Pallavi Publications
- ISBN :MANIMN1617
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock