అవును... చరిత్రనే సృష్టించారు
ఇంగ్లిష్ అనువాదానికి ముందుమాట -
వందనా సోనాల్కర్
"ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి మా ఊరి నది దగ్గర కున్బీలకు, మహార్లకు వేరు వేరు బండలు ఉన్నాయి. అయినా నేను కావాలనే కున్బీల బండ దగ్గరకెళ్ళి నా బట్టలు ఉతికాను. మరుక్షణం నలుగురు కున్బీ ఆడవాళ్ళు పరుగెత్తుకుంటూ వచ్చి 'ఏయ్ మహార్నీ నీకు కళ్ళేమైనా దొబ్బాయా? ఇది మా బండ అని తెలియదా నీకు?' అని అరిచారు.
'ఎవర్నే మహార్నీ అంటున్నారు? ఏం...నా బట్టలు ఇక్కడ ఉతికితే ఏమవుతుంది? కావాలంటే మీ బండ మీద నీళ్ళు పోసి శుద్ధి చేసుకోండి' అన్నాను. వాళ్ళు వెంటనే 'ఎంత పనికిమాలిన ఆడదానివి నువ్వు' అనేసరికి నేను కోపం పట్టలేక పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళల్లో ఒకామె జుట్టు పట్టుకున్నాను. నన్ను మహార్నీ అని ఎవరైనా పిలిస్తే నాకు మహా కోపం వస్తుంది. అలా పిలిపించుకోవడం నాకు చెడ్డ అసహ్యం. పెద్ద గొడవయ్యింది. వాళ్ళు నలుగురు ఉన్నారు. నేను ఒక్కతిని. అయితేనేం నేను ఒక్కదాన్ని చాలదా వాళ్ళకు జవాబు చెప్పడానికి. ఇంతలో మా మామగారు జోక్యం చేసుకుని గొడవ ఆపారు.”
"నా మొదటి గీతం నేను భీమ్ కోసం పాడతాను
నేను సత్యాగ్రహంలో పాల్గొని, ఆయన్ని దగ్గరనుండి చూస్తాను.
నా రెండవ గీతం అతనికే
మాకు నీరు తోడుకొనే హక్కు ఎవరు ఇచ్చారో
ఆయన కారణంగానే, బాయి, మేము ఈ వ్యాన్లో సంతోషంగా ఉన్నాము. నా మూడవ గీతం,
ప్రజలందరినీ ఆనంద వధువులా చేసిన
రమా ఆయి స్వామికి”,
మొదటి పేరాలో ఉటంకించిన సంఘటన ఈ పుస్తకం రెండవ భాగంలో ఉన్న దళిత మహిళల ఇంటర్వ్యూల నుండి తీసుకున్నది. ఒక మహార్ మహిళ అటువంటి పని చేస్తే ఈ రోజైనా అలాంటి ప్రతిస్పందనే ఎదురవ్వొచ్చు. భారత గ్రామీణ జీవిత వాస్తవికత...............