మేనల్లుడు
USA లో Harvard University లో Hereditary Diseases (అనువంశిక వ్యాధుల) మీద రీసెర్చ్ జరుగుతుంటుంది. టీమ్ లీడర్ వివేక్ తో పాటు దివ్య, రాధిక, సునీల్, డేవిడ్ ఇంకా కొంత మంది కలసి రీసెర్చ్ చేస్తుంటారు.
ఈ రోజు ఎలాగైనా తన మనసులో మాట వివేక్ తో చెప్పాలన్న నిర్ణయానికి వచ్చేస్తుంది దివ్య. ఆ మాటే రాధికతో చెప్పింది.
"ఇప్పటికి చాలా సార్లు చెప్పావు ఈ మాట.. సంవత్సరాలు గడిచిపోతున్నాయి.. నువ్వంటే వివేక్కి లైకింగ్ ఉంది. నీకైతే చెప్పనే అక్కరలేదు.. వివేక్ అంటే ప్రాణం.. పిచ్చి మొద్దు!.. ఈ పాటికి వివేక్ చెప్పేసి ఉంటే, లవర్స్ బ్రహ్మాండంగా లైఫి ఎంజాయ్ చేస్తుండేవారు.. నేనైతేనా ఎప్పుడో చెప్పేసేదానిని” అంది రాధిక. చిరు కోపంతో అంది దివ్య -
“ఏం నేనే ముందు చెప్పాలా? నేనంటే లైకింగ్ ఉన్నవాడు, నేనంటే ప్రత్యేకమైన అభిప్రాయం ఉన్నవాడు, చిన్నమాట చెప్పలేడా?”
“O.K., వివేక్ చెప్పలేదునుకో, నీ మనసులో మాట చెప్పవా?.. ప్రేమంటే ఇద్దరు ఒకరితో ఒకరు I love you చెప్పకుంటేనే ప్రేమ అంటారనుకుంటున్నావా?
ఇద్దరిలో ఒకరికి ఇంకొకరి మీద ప్రేమ ఉన్నా దాన్ని లవ్ అనే అంటారు. నీకు వివేక్ అంటే లవ్ ఉంది. తనే I love you అని చెప్పాలని ఎదురు చూస్తావెందుకు? ఒక వేళ I love you అని వివేక్ చెప్పలేదనుకో.. డ్రాప్ అవుతావా?” అంది రాధిక..............