• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mera Bap Khayyum

Mera Bap Khayyum By Humayun Sangheer

₹ 230

'చూపు'న్న కథలు

దేశమంతా ఇవ్వాళ 'చూపుడు వేలు చుట్టే' తిరుగుతోంది. అది చూపుడు ఇంకు గుర్తు పెట్టే ఓట్ల రాజకీయాలు కావొచ్చు. రాజకీయాభిప్రాయాలను ప్రభావితం చేస్తున్న సోషల్ మీడియా కావొచ్చు. అన్నీ చూపుడు వేలుతో బంధం అంటి పెట్టుకున్నవే! ఎందుకంటే సోషల్ మీడియాలో ఏం చేయాలన్నా మొబైల్ స్క్రీన్పై అడేది మొదట చూపుడు వేలే!

'మనం' వాళ్లు అని ప్రజల మధ్యన విభజన రేఖలు గీస్తూ విధ్వంసాలకు, విద్వేషాలకు ఈ చూపుడు వేళ్ళే సోషల్ మీడియాలో పాదులు తీస్తున్నాయి. అయితే వీటన్నింటికి ఇంకా చెప్పాలంటే విద్వేషానికి జవాబు జ్ఞానము పంచడమే విరుగుడు అని చెప్పే అంబేడ్కర్ చూపుడు వేలు చూపిస్తున్న మార్గాన్ని ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే సమాజంలోని మెజారిటీ అయిన బహుజన సమూహానికి, అందులో భాగమైన మైనారిటీ ముస్లిం సమాజానికి అంత మేలు జరుగుతుంది.

దేశంలో ప్రజాస్వామ్యానికి రక్షణనిచ్చేది ఈ చూపుడు వేలే! ఈ చూపుడు వేలు రూపొందించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం, ఐకమత్యతని ప్రోది చేసి, భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధించే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఇవ్వాళ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏండ్ల పండుగ జరుపుకుంటున్నాం. ఒక వైపు పండుగ జరుపుతున్న ప్రభుత్వాలే అదే రాజ్యాంగ భావనలను పాతర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

రాజ్యాంగ పీఠికలోని 'సెక్యులర్', 'సామ్యవాదం' తొలగించే ఎత్తుగడలు వేస్తున్నాయి. భారతీయ జనతాపార్టీకి చెందిన నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఈ పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకెక్కిండు. ఈ కలకు అడ్డుకట్టను ఎవరి శక్తి మేరకు వారు వేయాలి అనే సాహిత్యాచరణలో భాగమే హుమాయున్...................

  • Title :Mera Bap Khayyum
  • Author :Humayun Sangheer
  • Publisher :Ennela Pitta
  • ISBN :MANIMN6060
  • Binding :Papar back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :207
  • Language :Telugu
  • Availability :instock