₹ 90
"ఏదేమైనా, సీరియస్ గా రాజకీయాల్లోనూ, ప్రజాజీవితంలోను వుండే స్త్రీల జీవితాలన్నీ ఎదో మేరకు సంక్షుభితంగానే వుంటాయి స్వర్ణ. ఈ పురుషాధిక్య వర్గాధిక్య ప్రపంచం స్త్రీలను అంత తేలిగ్గా అంగీకరించలేదు. పితృస్వామ్యం ఎంత బలమైందో!"
"ఇక నాలాంటి వాళ్ళను గురించి చెప్పేదేముంది. నాదైన వ్యక్తిత్వాన్ని, సొంత అభిప్రాయాలను కలిగివుండడం , వీసమెత్తు పైతనాన్ని కూడా సహించకుండా వుండమంటే మాటలా? అందునా భద్రజీవితపు నమూనాలను ప్రశ్నిస్తే అసలు భరించాలేది లోకం."
"అయినా నాదెప్పుడు భిన్నస్వరమే స్వర్ణ... బహుశా నా స్వభావంలోనే ధిక్కార ధోరణి వుందనుకుంటా, అందరికి చాల బాగున్నదేదో నాకు అంతగా బాగుండదు. అందరూ వెన్నల, వెలుతుర్లని మురిసిపోయేచోట, నాకు ఆ వెన్నలతోపాటు చీకటి పోయలేవో తారాడుతూ కనబడతాయి."
- Title :Meruvu
- Author :Nalluri Rukmini
- Publisher :Viplava Rachayithala Sangam
- ISBN :MANIMN0941
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :159
- Language :Telugu
- Availability :instock