ఈ పుస్తకం చదివే ముందు
ఈ విషయాలను గురించి ముందుగా తెలుసుకోండి
మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు థైరాయిడ్ సమస్య ఉందని తెలిసిన తరువాత ఆందోళన చెందకుండా మనోధైర్యంతో ఉండండి. సరైన విధంగా చికిత్స తీసుకుంటూ మీ సంబంధిత వైద్యుని పర్యవేక్షణలో ఉంటే థైరాయిడ్ సమస్య ఉన్నప్పటికీ మిగతా వారి మాదిరిగానే ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
థైరాయిడ్పరంగా మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితం మనది అవుతుంది. ఇక వివరాలలోకి వెళదాం...
థైరాయిడ్ గ్రంథి : మనదేహంలో ముఖ్యమైన అవయవాలలో ఒకటి. థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మెడలో ముందు భాగంలో ఉంటుంది. ఇది మనదేహంలో, ముఖ్యమైన జీవక్రియలను హార్మోన్ల ద్వారా కొనసాగిస్తుంది.
హార్మోన్ : వినాళ గ్రంథుల నుండి ఉత్పత్తి అయ్యే ముఖ్యమైన రసాయన పదార్థం దేహంలోని ముఖ్యమైన క్రియలను నిర్వర్తించడంలో తోడ్పడుతుంది.
పిట్యూటరీ గ్రంథి : వినాళ (ఎండోక్రైన్) గ్రంథులన్నింటికి గురువు లాంటిదని చెప్పవచ్చు. మిగతా ముఖ్యమైన ఎండోక్రైన్ గ్రంథులు.....................