మీలోనే ఉన్న అతి గొప్ప నిధి
ఎనలేని సంపదలు మీకు అందుబాటులోనే ఉన్నాయి, ఎప్పుడైతే మీరు మీ మనోనేత్రాలు తెరిచి, మీలో ఉన్న ఆ అంతులేని నిధి గమనించగలిగితే మీకు కావలసిన సిరిసంపదలు, పేరు ప్రతిష్ఠలు, ఆనందమైన జీవితం, ఈ బాండాగారం నుంచి సమృద్ధిగా పొందవచ్చు.
చాలా మంది తమలో ఉన్న అనంతమైన చతురత, అపరమితమైన ప్రేమానురాగాల బంగారు నిధి గురించి తెలియక, గాఢనిద్రలో వుంటారు. మీకు కావలసింది మీరు ఆ గనిలోంచి పొందవచ్చు. ఓ అయస్కాంతీకృత ఇనుప ముక్క దాని బరువు కన్నా 12 రెట్ల బరువును పైకెత్తగలుగుతుంది. కానీ, అదే ఇనుప ముక్క నుంచి ఆ అయస్కాంత శక్తిని తొలగిస్తే, అదొక పక్షి ఈకను కూడా ఎత్త లేక పోతుంది. అదే విధంగా, మనుషుల్లో రెండు రకాల వాళ్లు ఉంటారు. అయస్కాంత ప్రభావం ఉన్నవ్యక్తి పూర్తి ఆత్మవిశ్వాసంతోనూ, నమ్మకంతోనూ ఉంటారు. తాము సాధించడానికి, గెలవడానికే పుట్టారనే సంగతి వాళ్లకు తెలుసు. అలాగే, మిగతా వారు అయస్కాంత శక్తి ప్రభావం లేనివారు. వాళ్లకి అన్నీ భయాలే, సందేహాలే. ఏదైన అవకాశం వచ్చినప్పుడు, వాళ్లు "ఒకవేళ ఇందులో ఓడిపోతే, నా డబ్బు పోవచ్చు. జనం నన్ను చూసి నవ్వుకుంటారు" అని అంటారు. ఈ రకమైన వ్యక్తులు జీవితంలో ముందుకు పోలేరు. ఎందుకంటే వారిలో ఉన్న భయం ముందుకు పోనివ్వదు. అందువల్ల ఎక్కడ వేసిన గొంగళి అదే చోటే ఉన్నట్లు ఉన్నచోటే ఉండిపోతాడు. మీరు ఆకర్షణశక్తి గల వ్యక్తిగా మారండి, యుగయుగాల నాటి అతి పెద్ద రహస్యాన్ని కనుక్కోండి...........