వర్షాసమయం
"వానొస్తుంటే కిటికీ తెరిచావెందుకు? మూసేయ్"
ఈ మనిషికి వానను అనందించడం రాదు. ఆస్వాదించడం తెలియదు. అర్థం చేసుకోవడం?? ఊహూ..!
"టిఫిన్ అయ్యిందా?”
“షర్ట్ ఇస్త్రీ చేశావా?”
"ఫైల్ ఇక్కడే పెట్టానే? నువ్వేమైనా తీశావా?”
ఆకాశంలోంచి అందంగా చినుకులు రాలుతున్న ఈ సమయంలో అడగాల్సిన ప్రశ్నలా ఇవి?
అన్నింటికీ విసుగ్గా ఊ కొట్టాను.
హడావుడిగా ఆఫీసుకి బయల్దేరి వెళ్లిపోయాడు. వెళ్లొస్తానన్న మాటైనా చెప్పలేదు..............