పాపం పరశురాం
పోయింది.
మళ్ళీ పోయింది.
తమ ఎంతో నమ్మి, దేవుడిపైన నమ్మకముంచి
కొన్నాడు.
ఒకటి, ఊహు... కాదు,
రెండా? ఊహు. కాదు
ఐదు!..... ఐదు కొన్నాడు!
ఏ ఒకటి ఒక రూపాయి క్కూడా నోచుకో లేదు.
భార్య మొత్తుకుంది.
"ఏమండి! ఏం లాభం వల్ల అవి కొంటున్నారొ నా కర్ధం కావడంలేదు? పోనీ దాని బదులు ఆ డబ్బును బ్యాంక్లో అన్నావేస్తే వడ్డీ వచ్చేది. పైగా మన డబ్బు మనకుండేది. క్రిందటిసారి మూడు కొన్నారు. ఏమైంది? బిక్క మొహం వేసారు. ఇప్పుడు ఐదే కొన్నారు. ఏమైంది? పోయింది చూసారా! ఇక ఈ సారయినా ఆ లాటరీకి తగలేసే డబ్బు బ్యాంకిలో వేయండి."
భార్య సలహా ఈసారి పెడచెవిన పెడితే భార్యతో తిట్లు తినాలి. కాని..... ఎప్పటికయినా రాకపోతుందా అన్న ఆశ. ఆశ..... ఛీ-ఆశ అన్నది తన మనసుని అకట్టుకుని ఆడిస్తోంది............................