₹ 1000
మా పలుకొటం అయ్యోరికి గెడారం వుండేది గాదు. ఆయన కుడి చేతి మణికట్టు మీద ఒక వాత వుండేది. మా పిలకాయ శానా మంది మణికట్లకు అటువంటి వాతలు వుండాయి.
పిలకాయలు- అని అన్నాక, వాళ్ళు మట్టిలో ఆటలాడుకోకుండా వుండలేరు గదా. మట్టి తినని పసి పిలగాడు- పసి పిలగాడే గాదు గదా. పసితనంలో మట్టి తింటే పసికిర్లు వస్తాయని, అవిట్ని రాకుండా చేసేటందుకు మాకు ఆ వాతల్ని పెట్టిస్తారు మా పెద్దాళ్ళు. మా సిత్తూరు జిల్లా సెంద్రగిరి తాలూకాలో కౌటాల అనే గ్రామం వుండాది. ఇటువంటి వాతలు పెట్టడంలో ఆ వూరు స్కసి పొందింది. సూడబోతే, మా అయ్యోరికి కూడా కొటాల వాత తప్పలా.
మా ఇస్కూలు పిలకాయలం సాటుమాటుగా అనుకుంటాం: “ఒరే, అయ్యోరు కూడా సిన్నప్పుడు మట్టి తిన్నాడ్రో” అని
సేతికి గెడారం లేని మా అయ్యోరు - ఒరే గెంట పదకొండున్నర అయిందేమో వూళ్లోకి పోయి చూసేసి రండ్రా - అనేవోడు. ఆ మాట అయ్యోరి నోట ఎప్పుడొస్తాదా - అని మేమంతా కాపెట్టుకుని వుండేటోళ్లం. మా వూర్లో ఒకరిద్దరి సేతికి తెల్లటి కప్పల మాదిర గెడారాలు వుండాయి. కానీ వోళ్లు ఆ సమయానికి ఇంట్లో వుండరు గదా. మా వూళ్లో పెర్మినెట్టు గెడారం ఒకటుండాది. అది మా వూరి వి.ఎల్.డెబుల్యూ ఇల్లు. (ఆయన మా మేనత్త కొడుకే.)
అయ్యోరు - టైం జూసేసి రండ్రా - అని అన్నాక ఒకటో తరగతోళ్ల నుంచి అయిదో తరగతి వాళ్ల దాకా పది మంది అయినా పైకి లేస్తారు ఆత్రం ఆత్రంగా. ఆ పది మందిలో ఎనిమిది మంది అయ్యోరి సేత దెబ్బలు తింటారు. ఇద్దరు మాత్రం వి.ఎల్.డబ్ల్యూ గోడ గెడారం కాడికి పోతారు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు
- Title :Mitturodi Samagra Sahityam
- Author :Dreams Foundation
- Publisher :Dreams Foundation
- ISBN :MANIMN2516
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :826
- Language :Telugu
- Availability :instock