ఇది న్యాయ వ్యవస్థ గురించి మాత్రమే కాదు, మొత్తం మన వ్యవస్థ గురించి...
మాడభూషి శ్రీధర్
రాజ్యాంగ నేరమేమంటే, నేరంగా పరిగణించబడని ఆలస్యాలు. ప్రభుత్వం (కార్యవర్గం) న్యాయంతో చెలగాటం చేస్తున్నదని మన దేశ పదేళ్ల న్యాయ వ్యవహారాలు తెల్పుతున్నాయి. తీర్పులు, న్యాయాలు కూడా అనుకున్న రీతిగా వచ్చినట్టు సహజంగా కనిపించినా వాటిని ఒక బలీయమైన శక్తి నడిపిస్తూ ఉందని సులువుగా అర్థమవుతుంది. ఏమిటీ ఆలస్యం? ఎందుకు కొన్ని చోట్ల విచారణలు త్వరగా అవుతాయి? కొందరు పెద్దలు ఉంటే కేసులు తెమలవు. అసలు తెగవు. కోర్టునుంచి జైలుకు పోవలసిన మహానుభావులు చనిపోవడం దాకా కేసు నడుస్తూనే లేదా నడుపుతూ ఉంటూ లేదా అందుకు అనుగుణంగా వ్యవస్థ నడుస్తూ ఉంటుందని పరిశోధిస్తే తేలుతుంది. ఈ వ్యవహారాన్ని రచయిత్రి నందిని సుందర్ సూత్రీకరించారు. సిద్ధాంతీకరించారు.
విడివిడిగా వార్తలు రాస్తే అర్థం కాదు. కాని సమగ్రంగా పరిశోధిస్తే దారుణమైన అన్యాయాలు కళ్లకు కట్టినట్టు కనబడతాయి. అదే నందిని సుందర్ వ్యాసం. సుదీర్ఘమైన పెద్ద పుస్తకం రాయవలసినంత వివరాలను చాలా సంక్షిప్తంగా ఏ అంశాన్ని వదలకుండా. చెప్పిన వ్యాసం ఇది. లాయర్లు, లా విద్యార్థులు, లా టీచర్లు చదివి తీరవలసిన వ్యాసం. రాజ్యాంగ పాఠాల్లో, సెమినార్లలో చర్చించవలసిన తీవ్రమైన అంశాలు అందులో ఉన్నాయి.
అందులో మొదటిది 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న మానవహక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ గారి పోరాటం. జాఫ్రీ, ఆమెకు అండగా నిలబడ్డ సెతల్వాద్ తప్పుడు...................