మన వంటి పెద్ద దేశం ఆహార భద్రత కలిగి వుండాలంటే ఆ తిండిని మనమే పండించుకోవాలి. మన భూములు మీద ఏ పంటలు పండించాలన్నది స్వేచ్చా మార్కెట్ శక్తులకు వదిలిపెట్టకూడదు. మన సమాజం సజావుగా నడవాలంటే ఏ పంటలు పండించాలన్న విషయంలో ప్రభుత్వ జోక్యం తప్పకుండా ఉండాలి. ఇటువంటి జోక్యం ఉండాలంటే ప్రభుత్వం ఆహార ధాన్యాల ధరలను కూడా నియంత్రించాలి. వాటిని స్వేచ్చా మార్కెట్ శక్తులకు విడిచి పెట్టకూడదు. |