• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mogal Samrajya Pathanam

Mogal Samrajya Pathanam By P Narasimharao

₹ 200

పరిచయం

భారతదేశాన్ని మొగల్ చక్రవర్తులు 1526 వ సంవత్సరం మొదలుకొని 1857 వ సంవత్సరం వరకూ అంటే సుమారు 330 సంవత్సరాలు పాలించారు. కానీ యిన్ని సంవత్సరాల పాలనలోనూ కేవలం 180 సంవత్సరాలు మాత్రమే వారు అవిచ్ఛిన్నమయిన అధికారం చెలాయించగలిగారు. 1707 లో ఔరంగజేబ్ మరణం తరువాత గద్దె ఎక్కిన అతని కుమారుడు మొదటి బహుదూర్ షా కేవలం ఐదేళ్ళు సుస్థిరపాలన అందించగలిగాడు. కానీ ఆయన అనంతరం వచ్చిన రాజు లెవరూ సమర్ధులు కాకపోవడంతో, పాలన మంత్రుల చేతిలోనికి పోవడంతోపాటు... అధికారం బలహీనపడటం ఆరంభించి ఆఖరి మొగల్ చక్రవర్తి బహుదూర్‌షా జాఫర్ కాలానికి పూర్తిగా పరాధీనస్థితికి చేరుకొంది. చివరికి సిపాయిల తిరుగుబాటు జరిగింది. దానికి బహదూర్‌షా జాఫర్ నాయకత్వం వహించాడని ఆరోపించిన బ్రిటిష్ అధికారులు ఆయనను పదవి నుండి తప్పించి రంగూన్లోని కారాగారానికి పంపారు. ఆయన చివరి రోజులు అక్కడే గడిచిపోయి... కారాగారంలోనే ఏమాత్రం గుర్తింపులేని ఖైదీగా మరణించాడు.

ఎంతో గొప్పదని పేరుపొందిన మొగల్ సామ్రాజ్యం అలా బ్రిటిష్ వారి చేతిలో అంత మయిపోయింది. ఈ పుస్తకంలో అలనాటి ఆఖరి మొఘల్ చక్రవర్తిని, దేశం మొత్తం క్రమంగా ఆక్రమించుకుంటూ వచ్చిన బ్రిటిష్ వారు ఎలా పదవీచ్యుతుడ్ని చేశారు...? ఆనాటి కాలమాన పరిస్థితులు ఎలా వున్నాయి...? ఏయే బ్రిటిష్ అధికారులు అందుకు ఎలా పావులు కదిపారు...? అప్పటి భారత ప్రజలు, ముఖ్యంగా ఢిల్లీలోని పౌరులు ఈ సంఘటనలకి ఎలా ప్రతిస్పందించారు? అనే అనేక విషయాలు... చరిత్రాంశాలు... లభించిన వివరాల ఆధారంగా అల్లిన కధనాల మాలిక...! ఇందులో రకరకాల సందర్భాలు... అవి జరిగిన సమయాలు, అందుకు కారణాల గురించి వివరించడం జరిగింది. అయితే యివి ఒక క్రమంలో రాకపోవచ్చు... సందర్భాన్ని బట్టి వెనక ముందులు కూడా వుండవచ్చు. అందుకు కారణం యివి చరిత్రలో లుప్తమయిపోకుండా బమయిన ఆధారాలతో దొరకడం. వీటిని రకరకాల చరిత్రకారులు వారి స్వభాష్యాలతో గ్రంధకరించడం కారణాలు అనేకంటే... చరిత్రలో ప్రభావం చూపిన వ్యక్తుల గురించి వివరిస్తూ వితకాలంలోకి వెళ్ళిరావడం... 'మళ్ళీ మరొక వ్యక్తి ఆ జీవితాన్ని స్పృశిస్తూ తిరిగి

కొనసాగించడం ప్రధాన కారణాలు. చాలా పుస్తకాలలో లభ్యమయిన విశేషాలు నా చరిత్రగా దీన్ని మీ ముందుకు తీసుకురావడానికి కారణం మన దేశగత చరిత్ర............

  • Title :Mogal Samrajya Pathanam
  • Author :P Narasimharao
  • Publisher :Briliant Books
  • ISBN :MANIMN3527
  • Binding :Paerback
  • Published Date :Oct, 2021
  • Number Of Pages :224
  • Language :Telugu
  • Availability :instock