పరిచయ వాక్యాలు
ఇది ఒక అద్భుతమైన విషయం.
మనిషి ఆలోచనలకు ఆధారమైన మౌలిక సూత్రం ఏమిటి?
ఈ ప్రశ్న ప్రతిమనిషికీ ఏదో ఒక సందర్భంలో వచ్చి తీరుతుంది. మనిషి రాగద్వేషాలకు ఆయాచితంగా బానిసైపోయి జీవిస్తున్నాడు. జీవితంలో ఒక సమయం వస్తుంది. 'మన పట్ల ఇతరులు వివక్షతతో వ్యవహరించారు' అనిపించినప్పుడు కానీ, మన కళ్లముందు అకారణంగా ఒక మనిషి మరో మనిషి పట్ల వివక్షతతో 5. వ్యవహరిస్తున్నారని అనిపించినప్పుడు కానీ, సమాజంలో అనేక దుర్ఘటనలకు ఈ వివక్షే కారణమవుతోందని ఎప్పుడన్నా మన దృష్టికి వచ్చినప్పుడు కానీ... ఇలాంటి సందర్భాలలో మన లోపలిమనిషికి స్పందన కలుగుతుంది. మనిపై ఉంటే కలిగి తీరుతుంది కదా!
ఆయా సందర్భాలను బట్టి, లేదా ఆయా బాధితుల పట్ల మనకుగల బంధాన్ని లేదా దృక్పథాన్ని బట్టి మన స్పందన స్వరూపం, పరిమాణం ఉంటుంటాయి. అలాంటి సందర్భాలలో ఈ 'వివక్ష' అనే రుగ్మత గురించి తీవ్రంగా ఆలోచిస్తూంటాం.
ఒకవేళ మనమే ఎప్పుడన్నా అనాలోచితంగా గానీ, ఉద్దేశపూర్వకంగా గానీ అలాంటి వివక్షతతో వ్యవహరించటం జరిగితే...? అప్పుడు కూడా మన లోపలిమనిషికి ఈ స్పందన కలుగుతుందా? ఆ లోపలిమనిషి ఇదే స్పృహతో వ్యవహరిస్తాడా?
ఆస్తికులం అందరం కోరుకునేది ఒక ఆరోగ్యకరమైన సమాజం అయినప్పుడు -ఆ సమాజంలోని విభిన్న వర్గాల, లేదా వర్ణాలవారు ఎలా ఆలోచిస్తే, ఎలా...................